క్రైమ్/లీగల్

నిలోఫర్ వైద్యునిపై కేసు నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 1: నిలోఫర్ పిల్లల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఏడాదిన్నర వయస్సున్న బాలుడు మృతి చెందడంతో వైద్యుల నిర్లక్ష్యం వల్లే బాలుడు చనిపోయాడని ఆ బాలుడి బంధువులు ఆందోళన చేశారు. హాస్పిటల్ వద్ద ధర్నాకు దిగడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి వారికి నచ్చచెప్పారు. వైద్యునిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. బాలుడి పోస్టుమార్టం నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు.