క్రైమ్/లీగల్

కాల్పుల కేసును ఛేదించిన పోలీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, ఏప్రిల్ 2: పట్టణంలో సంచలనం కలిగించిన కాల్పుల కేసును పోలీసులు ఛేదించారు. గతనెల 24వతేదీన జరిగిన ఈ సంఘటనలో నిందితులను అరెస్టు చేసినట్టు ఎస్పీ జి.పాలరాజు తెలిపారు. సోమవారం ఇక్కడ ఎస్పీ సమావేశ మందిరంలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బొత్స మోహన్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి మరో రియల్ ఎస్టేట్ వ్యాపారి నమ్మి అప్పలరాజును 9ఎంఎం తుపాకీతో కాల్చి చంపాడని ఎస్పీ తెలిపారు. ఈ సంఘటనలో నిందితునికి సహకరించిన మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వారిలో పట్టణానికి చెందిన కర్రోతు రమణమూర్తి అలియాస్ రమేష్ అనే వ్యక్తి తుపాకీ కొనుగోలుకు మధ్యవర్తిగా వ్యవహరించాడని తెలిపారు. అలాగే ఆశాన వెంకట రమణ అనే మరో వ్యక్తి మోహన్‌ను మోటారు బైక్‌పై ఘటన ప్రాంతానికి తీసుకురావడం, కాల్పులు జరుపుతున్న సందర్భంలో కాపలాదారునిగా వ్యవహరించడం, కాల్పుల అనంతరం నిందితుని నేరస్థలం నుంచి తప్పించడంలో ప్రధాన పాత్ర పోషించాడని ఎస్పీ వివరించారు. ఈ కేసులో బొత్స మోహన్‌కు తుపాకీ విక్రయించిన వ్యక్తి పరారీలో ఉన్నాడన్నారు.
ఇదిలా ఉండగా ఫిర్యాదుదారు నమ్మి అప్పలరాజు, అతని మామ ఉల్లంకుల శ్రీనివాసరావు రియల్ ఎస్టేట్ వ్యాపారం గత కొనే్నళ్లుగా చేస్తున్నారని తెలిపారు. ఆ విధంగా బొత్స మోహన్ నుంచి 2014లో రూ.16 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకున్నాడని, ఆ సొమ్ముకు బదులు తనకు ఇస్తానన్న భూమిని ఇవ్వకపోవడం, డబ్బును వెనక్కి ఇవ్వకపోవడం వల్ల వారిద్దరి మధ్య గతంలో గొడవలు ఏర్పడ్డాయన్నారు. ఇదే విషయమై పెద్ద మనుష్యుల వద్ద ఒప్పందాలు జరిగాయన్నారు. అయినప్పటికీ లావాదేవీల ప్రక్రియ కొలిక్కి రాకపోవడంతో ముందస్తుగా ఉద్దేశపూర్వకంగానే కాల్పులు జరిపాడని ఎస్పీ పాలరాజు వివరించారు. కాల్పుల అనంతరం తగరపువలస వద్ద గోస్తనీ నదిలో తుపాకీ పడేయడంతో గజ ఈతగాళ్లు తుపాకీ కోసం గాలింపు చేపట్టామన్నారు. ఈ కేసులో ఛేదించడంలో ప్రతిభ కనబరచిన పోలీసు అధికారులకు, గజ ఈతగాళ్లకు ఆయన రివార్డులు అందజేశారు. వారిలో వన్‌టౌన్ సిఐ చంద్రశేఖర్, ఎస్‌ఐలు జిఎవి రమణ, ఎ.నరేష్, సింహాచలంనాయుడు, రాజారావు, రామకృష్ణ, అశోక్‌కుమార్, హెచ్.ఉపేంద్ర, అమ్మినాయుడు, సిఐ జి.రామకృష్ణ, హెచ్‌సి ఎ.శంకరరావు, జగన్మోహనరావు, కానిస్టేబుళ్లు డి.శ్రీనివాసరావు, నాయుడు, ప్రసాద్, ఐటి కోర్ పిసి జి.రవికుమార్, రమేష్‌తోపాటు పూసపాటిరేగ మండలం బర్రిపేటకు చెందిన గజ ఈతగాళ్లు బర్రి దారయ్య, బర్రి పైడిరాజు, గుంటి ఎరకయ్య, మరుపల్లి పారయ్య, సూరాడ చయ్య, ఆకుల రామాలకు ఎస్పీ నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. ఈ సమావేశంలో ఎఎస్పీ ఎవి రమణ, ఎఎస్పీ పాటిల్, డిఎస్పీలు చక్రవర్తి, ఎవి రమణ, సిఐ చంద్రశేఖర్ పాల్గొన్నారు.