క్రైమ్/లీగల్

‘మై హోం’లో ఐటీ సోదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మై హోం గ్రూప్ సంస్థల అధినేత జూపల్లి రామేశ్వర్‌రావుకు చెందిన కార్యాలయాలు, నివాసంపై గురువారం ఆదాయపన్ను శాఖ సోదలు నిర్వహించింది. ఉదయం 7 గంట నుంచి కొనసాగుతున్న సోదలు చాలా రాత్రి చాలా పొద్దుపోయే వరకు కొనసాగుతూనే ఉన్నాయి. బెంగళూరు కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన ఐటీ అధికారులతో పాటు హైదరాబాద్‌కు చెందిన అధికారులు కూడా ఈ సోదాల్లో పాల్గొన్నారు. మై హోం గ్రూప్ అధినేత రామేశ్వర్‌రావుకు చెందిన నందగిరిహిల్స్‌లోని ఇంటిపైనా, అలాగే గచ్చిబౌలి, మాదాపూర్, జూబ్లీహిల్స్ తదితర ప్రాం తాల్లో ఉన్న వివిధ కార్యాలయాలతో పాటు హెటీరో ఫార్మా కంపెనీ కార్యాలయాలపై కూడా ఏకకాలంలో సోదాలు కొనసాగాయి. మై హోం గ్రూప్ వివిధ సంస్థల్లో భాగస్వామ్యంతో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఇటీవల ఇదే గ్రూప్‌నకు చెందిన అలంద మీడియా ప్రముఖ తెలుగు టీవీ ఛానల్‌కు కూడా కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ దాడులలో మై హోం గ్రూప్‌నకు చెందిన వ్యాపార లావాదేవీలు, చెల్లించిన పన్నులకు సంబంధించిన పత్రాలను మాత్రమే పరిశీలించినట్టు తెలిసింది. అయితే ఈ సోదాల్లో ఎలాంటి జప్తులు కానీ, కేసులు కానీ నమోదు చేయలేదని హైదరాబాద్‌కు చెందిన ఐటీ అధికార వర్గాల సమాచారం.