క్రైమ్/లీగల్

ఆర్టీసీ బస్సులో రూ. 10 లక్షల చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్కట్‌పల్లి, జూలై 4: ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడి నుండి పది లక్షల నగదు చోరీకి గురైన సంఘటన గురువారం ఉదయం హైద్రాబాద్-విజయవాడ జాతీయ రహదారి వద్ద గల నార్కట్‌పల్లి వద్ద చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విజయవాడ నుండి హైద్రాబాద్‌కు బయలుదేరిన నిజామాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ సెమీ లగ్జరీ బస్సు ఉదయం 8గంటల సమయంలో నార్కట్‌పల్లి సమీపంలోని పూజిత హోటల్ వద్ద టిఫిన్ కోసం బస్సు ఆగింది. ఇదే బస్సులో ప్రయాణిస్తున్న మందాల సంజీవరెడ్డి, అతని స్నేహితుడు శేఖర్‌రెడ్డి టిఫిన్ కోసం హోటల్ వద్ద దిగారు. అతను తెచ్చుకున్న 10 లక్షల 35 వేల రూపాయలు బ్యాగ్‌లో బస్సులోనే ఉంచాడు. టిఫిన్ ముగించుకుని బస్సులోకి వచ్చి చూడగా బ్యాగ్‌లో నుండి పది లక్షలు చోరీకి గురయ్యాయ. వెంటనే సంజీవరెడ్డి లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. అయితే బస్సులో 21 మంది ప్రయాణికులు ఉండగా చోరీ అనంతరం కేవలం 20 మంది మాత్రమే ఉండటంతో పారిపోయిన ప్రయాణికుడే ఈ చోరీకి పాల్పడినట్టు భావిస్తున్నారు. సీసీ ఫుటేజ్‌ల ద్వారా చోరీని ఛేదించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. విజయవాడ బస్టాండ్‌లోని సీసీ ఫుటేజ్‌లను పరిశీలించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.