క్రైమ్/లీగల్

పరిశ్రమలో పనిచేస్తూ కార్మికుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, జూలై 4: ప్రైవేటు పరిశ్రమలో పనిచేస్తూ కార్మికుడు మృతి చెందిన సంఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే ఒడిశా రాష్ట్రానికి చెందిన బృందావన్ బోరడ్ (60) సూరారం గ్రామం, విశ్వకర్మ కాలనీలో భార్య శకుంతల, కూతురితో కలిసి నివసిస్తున్నాడు. జీడిమెట్లలోని సూపర్ ఫ్లో ప్రైవేటు పరిశ్రమలో సంపు నిర్మాణ పనుల్లో బృందావన్ బోరడ్ పనిచేస్తున్నాడు. సంపు వద్ద బోరడ్ ఆకస్మాత్తుగా పడి మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న మృతుని భార్య, కూతురు పరిశ్రమ వద్దకు చేరుకుని మృతదేహంతో పరిశ్రమ ఎదుట ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ భైటాయించారు. ఈ మేరకు పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు టేస్తున్నారు.