క్రైమ్/లీగల్

శేఖర్ రెడ్డికి నార్కో అనాలసిస్ పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పులివెందుల, జూలై 4: మాజీ మంత్రి వై ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో మరో నిందితుడు దిద్దికుంట శేఖర్‌రెడ్డికి నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహించేందుకు పులివెందుల కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న చంద్రశేఖర్‌రెడ్డికి నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహించేందుకు అనుమతించాలని పోలీసులు పులివెందుల కోర్టును ఆశ్రయించారు. పరీక్షలకు అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నార్కో పరీక్షల కోసం గతంలో పోలీసులు కోర్టును ఆశ్రయించగా తిరస్కరించింది. అయితే తాజాగా గురువారం కోర్టు అనుమతిచ్చింది. పరీక్షలకు సహకరించాలని శేఖర్‌రెడ్డిని ఆదేశించింది. కోర్టు ఉత్తర్వుల ప్రకారం పోలీసులు ఎప్పుడు పిలిచినా నార్కో అనాలసిస్ పరీక్షలకు హాజరుకావాలని శేఖర్‌రెడ్డిని ఆదేశించింది. దిద్దికుంట శేఖర్‌రెడ్డికి పోలీసులు భద్రత కల్పించారు. ఈ కేసులో ఇప్పటికే వివేకా ఇంటి వాచ్‌మన్ రంగయ్యను పరీక్షల నిమిత్తం పోలీసులు హైదరాబాద్‌కు తరలించిన సంగతి తెలిసిందే. మరో రెండురోజుల్లో శేఖర్‌రెడ్డిని పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌కు తరలించనున్నట్లు సమాచారం.