క్రైమ్/లీగల్

ఆజం ఖాన్ ఎన్నికపై జయప్రద పిటిషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలహాబాద్, జూలై 5: రాంపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి సమాజ్‌వాది పార్టీ అభ్యర్థి ఆజం ఖాన్ విజయాన్ని సవాల్ చేస్తూ బీజేపీ నాయకురాలు, మాజీ ఎంపీ జయప్రద అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. లోక్‌సభకు పోటీ చేసిన ఆజం నామినేషన్ దాఖలు చేసే సమయానికి మహ్మద్ అలీ జౌహర్ యూనివర్సిటీ ఛాన్సలర్‌గా ఉన్నారని ఆమె తెలిపారు. ఉద్యోగానికి రాజీనామా చేయకుండా పోటీ చేయడం ఇది ఎన్నికల నియామవళికి విరుద్ధమని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇంకా ఎన్నికల సమయంలో ఆజం మతపరంగా ఓట్లు కోరడం జరిగిందన్నారు. ఆజం పోటీ చేయడాన్ని సవాల్ చేస్తూ లోగడ ఆమె లక్నో బెంచ్‌ను ఆశ్రయించారు. అయితే రాంపూర్ నియోజకవర్గం అలహాబాద్ హైకోర్టు పరిథిలో ఉందని తెలుపుతూ లక్నో బెంచ్ ఆ పిటీషన్‌ను కొట్టి వేసింది.