క్రైమ్/లీగల్

జాతీయ రహదారిపై మునగాల వద్ద విషాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మునగాల, జూలై 5: అనారోగ్యంతో మృతిచెందిన తల్లి మృతదేహానికి అంత్యక్రియలు జరిపించేందుకు తీసుకెళ్తూ రోడ్డుప్రమాదంలో కుమార్తె దుర్మరణం పాలు కాగా మరో ఎనిమిది మంది కుటుంబసభ్యులు తీవ్రంగా గాయపడిన విషాద సంఘటన సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలో 65వ నెంబరు జాతీయరహదారిపై గురువారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల పరిధిలోని సిద్ది గ్రామానికి చెందిన జుట్టు లక్ష్మమ్మ (95) కుటుంబసభ్యులు గత పదిహేనేళ్లుగా హైదరాబాద్‌లో స్థిరపడి చిరు ఉద్యోగాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కాగా లక్ష్మమ్మ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ గురువారం మృతిచెందింది. ఆమె అంతిమసంస్కారాల నిమిత్తం లక్ష్మమ్మ కూతురు చల్లా నాగమ్మ (55) లక్ష్మమ్మ కుమారుడు రంగారావుతో పాటు ఆయన కుమార్తెలు రమా, వౌనిక, కుమారుడు లోకేష్, చల్లా నాగమ్మ కుమారుడు కృష్ణ, అల్లుడు పసల బాబురావు, ఆయన భార్య స్వాతి తుఫాన్ వాహనంలో సిద్ది గ్రామానికి బయలుదేరారు. గురువారం అర్ధరాత్రి సమయంలో వీరు ప్రయాణిస్తున్న తుఫాన్ వాహనం మండల పరిధిలోని ఆకుపాముల గ్రామసమీపంలోని పెట్రోల్‌బంకు సమీపంలోకి చేరుకోగా యూ టర్ను తీసుకుంటున్న గుర్తులేని వాహనాన్ని వెనుకనుండి వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాగమ్మ అక్కడికక్కడే దుర్మరణం చెందగా వాహనంలో ఉన్న మిగిలిన ఎనిమిది మంది కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను మొదట చికిత్స నిమిత్తం కోదాడకు తరలించగా అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం హైద్రాబాద్‌కు తరలించారు. బంధువులు ఇచ్చిన పిర్యాదు మేరకు మృతదేహానికి కోదాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో శవపరీక్ష నిర్వహించారు.