క్రైమ్/లీగల్

నన్ను అపార్థం చేసుకున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 6: కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ పాత్రికేయుడు ఎంజే అక్బర్ దాఖలు చేసిన పరువునష్టం కేసులో విచారణ ముగిసింది. జర్నలిస్టు ప్రియారమణి తనను అక్బర్ లైంగికంగా వేధించారంటూ ‘మీటూ’ వేదిగా తీవ్రమైన ఆరోపణలు చేసి సంచలనం సృష్టించారు. ఆమె ఆరోపణకు తనకు పరువునష్టం కలిగించాయని ఎంజే అక్బర్ ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో అక్బర్ నుంచి శనివారం వాంగ్మూలం తీసుకున్నారు. అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సమర్ విశాల్ సమక్షంలో ఎంజేను విచారించారు. అక్బర్ వద్ద పనిచేస్తున్న సమయంలో తమపట్ల అనుచితంగా ప్రవరించేవారని మిగతా మహిళా పాత్రికేయులు చేసిన ఆరోపణలపై క్రాస్ ఎగ్జామినేషన్ జరిపారు. ప్రియారమణి తరఫున సీనియర్ న్యాయవాది రెబక్కాజాన్ మాజీ మంత్రిని పలు ప్రశ్నలు వేశారు. అయితే తమను అపార్ధం చేసుకున్నారని, ఎవరి పట్లా అనుచితంగా ప్రవర్తించలేదని అక్బర్ చెప్పుకొచ్చారు. తాను ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదని ఆయన వాదించారు. ‘రూత్ డేవిడ్ రాసి వ్యాసం గురించి నాకు తెలియదు. ఆ వ్యాసాన్ని నేను చదవనే లేదు. అందులో పేర్కొన్నవనీ అవాస్తవాలే. నాకు ఎలాంటి సంబంధం లేదు’అని న్యాయమూర్తికి తెలిపారు. తనను తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయన వాపోయారు. తన వద్ద పనిచేసే మహిళా జర్నలిస్టుల పట్ల అనుచితంగా ప్రవర్తించడంతోపాటు లైంగికంగా వేధించేవారని తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్న ఎంజే అక్బర్ గత ఏడాది అక్టోబర్ 17న మంత్రి పదవికి రాజీనామా చేశారు. ‘మీటూ’ వేదికగా ప్రియారమణి చేసిన ఆరోపణలు తన పరువుకు భంగం కలిగించాయంటూ అక్బర్ కోర్టుకెక్కారు. అయితే ఇలాంటి ఆరోపణలే అనేక మంది మహిళా జర్నలిస్టులు చేసినా ఒక్క రమణిపైనే పరువునష్టం కేసు వేశారు. తనను ఉద్దేశించి రమణి చేసిన ట్వీట్లు అభ్యంతరకరమైనవని, తనపై తప్పుడు రాతలు, అబద్ధాలు ప్రచారం చేశారని ఆయన ఆరోపించారు. ప్రియా రమణి వ్యాసంలో పేర్కొన్నవన్నీ అవాస్తవాలేనని న్యాయమూర్తికి తెలిపారు. అక్బర్‌ను ప్రశ్నించిన కోర్టు తదుపరి విచారణ ఈనెల 15కు వేసింది.