క్రైమ్/లీగల్

మానవ హక్కుల కోర్టుల ఏర్పాటుపై మీ వైఖరేమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 8: దేశంలోని అన్ని జిల్లాల్లో మానవ హక్కుల కోర్టుల ఏర్పాటుపై మీ వైఖరి ఏమిటని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. అన్ని జిల్లాల్లో మానవ హక్కుల కోర్టు ఏర్పాటు తప్పనిసరి అని అంటూ దాఖలైన పిటిషన్‌ను సోమవారంనాడు దేశ అత్యున్నత న్యాయస్థానం విచారించింది. మానవ హక్కుల పరిరక్షణ చట్టం కింద ఈ కోర్టుల ఏర్పాటు తప్పనిసరి అని భావించిన సుప్రీంకోర్టు ఇందుకు అనుగుణంగా వ్యవహరించేందుకు వీలుగా కేంద్రానికి ఆదేశించింది. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ అధ్యక్షతన జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ అనిరుద్ధ బోస్‌తో కూడిన బెంచ్ దేశంలోని 29 రాష్ట్రాల్లో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు (ఎస్‌పీపీలు)ను నియమించాలని నోటీసు జారీ చేసింది. మానవ హక్కుల ఉల్లంఘన కింద దాఖలైన కేసులను మూడు నెలల్లోగా విచారించేందుకు వీలుగా అన్ని జిల్లాల్లో మానవ హక్కుల కోర్టులను ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని బెంచ్ స్పష్టం చేసింది. భవికా ఫోర్ అనే న్యాయశాస్త్రం విద్యార్థిని దాఖలు చేసిన పిటిషన్‌పై దేశంలోని 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాల్లో గల 725 జిల్లా కేంద్రాల్లో నిర్ణీత కాలంలోగా మానవ హక్కుల కోర్టులను తక్షణం ఏర్పాటు చేసి, తగినన్ని నిధులు సమకూర్చాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. అదేవిధంగా దేశంలోని అన్ని హైకోర్టుల రిజిస్ట్రార్లకు సైతం ఈ మేరకు ఆదేశాలు జారీ చేయాలని సదరు న్యాయ విద్యార్థిని తన పిటిషన్‌లో సుప్రీంను అభ్యర్థించారు. ఇదిలావుండగా, జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) దృష్టికి 2001 నుంచి 2010 వచ్చిన కేసుల్లో 14,231 మంది పోలీసుల కస్టడీలోనే మరణించగా, 12,727 మంది జ్యుడీషియల్ కస్టడీలో మరణించారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని దేశవ్యాప్తంగా జిల్లా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మానవ హక్కుల కోర్టుల ఏర్పాటుకు స్పందన తెలపాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.