క్రైమ్/లీగల్

నేనే హత్య చేశా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 18: నగరంలో సంచలనం సృష్టించిన స్టీల్ వ్యాపారి తెల్లప్రోలు రాంప్రసాద్ హత్య కేసు కొత్త మలుపుతిరిగింది. రాంప్రసాద్‌ని తానే హత్య చేశానంటూ శ్యామ్ అనే వ్యక్తి మీడియా ముందుకొచ్చి కలకలం సృష్టించాడు. చోటూ, నరేష్‌తో కలిసి రాంప్రసాద్‌ను హత్య చేసినట్టు వెల్లడించాడు. కోగంటి సత్యం హత్య చేశారని హతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న నేపథ్యంలో తెరమీదకు శ్యామ్ రావడం గమనార్హం. ఈ కేసులో శ్యామ్‌తో పాటు మరో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
శనివారం రాత్రి 8 గంటల సమయంలో ముగ్గురు దుండగులు పంజాగుట్టలో రాంప్రసాద్‌పై కత్తులతో దాడి చేసి దారుణంగా చంపేశారు. తీవ్ర గాయాలైన అతడిని యశోదా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అర్థరాత్రి మృతిచెందారు. ఈ హత్య కేసులో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. పంజాగుట్ట పోలీస్టేషన్ పరిధిలో వారం రోజుల వ్యవధిలోనే రెండు హత్య కేసులు చోటు చేసుకున్నాయి. దీంతో ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేస్తున్నారు.