క్రైమ్/లీగల్

చత్తీస్‌గఢ్‌లో మహిళా కమాండర్ హతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా డబ్బాకొంట దండకారణ్యంలో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు మహిళా కమాండర్ కురాం భీమే హతమైంది. ఈమెపై రూ. 8లక్షల రివార్డు ఉంది. ఎన్‌కౌంటర్ ప్రదేశంలో పోలీసు బలగాలకు ఇన్సాస్ రైఫిల్ కూడా లభ్యమైంది. డబ్బాకొంట ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో బలగాలను అక్కడికి పంపామని సుక్మా ఎస్పీ శలభ్ సింహా తెలిపారు. భద్రతా బలగాలను చూసి మావోయిస్టులు కాల్పులకు దిగారని, బలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయని, ఈ క్రమంలో మహిళా కమాండర్ చనిపోయినట్లు ఆయన తెలిపారు. ఈ ప్రాంతంలో రామన్న, తదితర మావోయిస్టు ముఖ్య నేతలు ఉన్నట్లు భావిస్తున్నామన్నారు. భద్రతా బలగాల కాల్పుల్లో కొందరు మావోయిస్టులకు గాయలయ్యాయని, వారు అడవుల్లోకి పారిపోయారని ఆయన పేర్కొన్నారు. సంఘటనా స్థలిలో లభ్యమైన ఇన్సాస్ రైఫిల్ 2010 ఏప్రిల్ 1న తాడిమెట్ల అటవీ ప్రాంతంలో 76మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లను మావోలు బలిగొన్న సందర్భంలో ఎత్తుకెళ్లినదిగా గుర్తించామని చెప్పారు. తూటాలు, మందులు, విప్లవ సాహిత్యం, ఇతర సామగ్రిని కూడా ఎన్‌కౌంటర్ ప్రదేశం నుంచి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వివరించారు.

చిత్రాలు.. ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావో మహిళా కమాండర్
* బలగాలు స్వాధీనం చేసుకున్న రైఫిల్, తూటాలు, మందులు, ఇతర సామాగ్రి