క్రైమ్/లీగల్

రాహుల్‌కు మళ్లీ సమన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్, జూలై 9: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయంతో తీవ్ర మనస్థాపానికి గురై పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్ గాంధీపై మూలిగే నక్కపై తాటి కాయ పడ్డ చందంగా గుజరాత్ కోర్టు సమన్లు జారీ చేసింది. వచ్చే నెల 9న స్వయంగా హాజరు కావాలని గుజరాత్ కోర్టు ఆదేశిస్తూ తిరిగి కొత్తగా సమన్లు జారీ చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు, హోం మంత్రి అమిత్ షా హత్య కేసులో నిందితుడని ఆరోపించిన రాహుల్ గాంధీ చిక్కుల్లో పడ్డారు. రాహుల్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన అహ్మదాబాద్‌కు చెందిన స్థానిక బీజేపీ నాయకుడు క్రిమినల్ పరువు నష్టం దావా కేసు వేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏప్రిల్ 23న రాహుల్ గాంధీ జబల్‌పూర్‌లోని ఓ బహిరంగ సభలో ప్రసంగిస్తూ అమిత్ షాపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినట్లు బీజేపీ కార్పోరేటర్ కృష్ణవందన్ బ్రహ్మంభట్ కేసు నమోదు చేశారు. 2015 సంవత్సరంలో షోహ్రబుద్దీన్ షేక్, తులసీరాం ప్రజాప్రతి ఎన్‌కౌంటర్ కేసులో అమిత్ షా నిందితుడని చేసిన ఆరోపణలపై కేసు నమోదైంది. ఐపీసీ-500 కింద క్రిమినల్ కేసు నమోదైనందున, ఆగస్టు 9న కోర్టు ముందు స్వయంగా హాజరుకావాలని అహ్మదాబాద్ మెట్రోపాలిటన్ చీఫ్ మెజిస్ట్రేట్ డీఎస్ దాబి తిరిగి రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేశారు. కాగా షోహ్రబుద్దీన్ షేక్ ఎన్‌కౌంటర్ కేసులో అమిత్ షా నిర్దోషి అని 2015 సంవత్సరంలోనే సీబీఐ కోర్టు స్పష్టం చేసిందని కృష్ణవందన్ బ్రహ్మంభట్ పిటీషన్‌లో పేర్కొన్నారు. దీనిపై హైకోర్టులోగానీ, సుప్రీంకోర్టులో గానీ ఎవరూ ఛాలెంజ్ చేయలేదని, అయినా రాహుల్ గాంధీ రాజకీయ లబ్ది కోసం అమిత్ షాపై ఆరోపణలు చేశారని ఆయన తెలిపారు. ఇలాఉండగా మరో మెజిస్ట్రేట్ కోర్టు రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలాకు క్రిమినల్ పరువు నష్టం దావా కేసుపై సమన్లు జారీ చేసింది. అహ్మదాబాద్ జిల్లా సహకార బ్యాంకు చైర్మన్ ఈ కేసును దాఖలు చేశారు. ఈ సహకార బ్యాంకులో అమిత్ షా డైరెక్టర్‌గా ఉన్నారు. 2016 సంవత్సరంలో పెద్ద నోట్ల రద్దు సందర్భంగా పెద్ద కుంభకోణం జరిగిందని రాహుల్ చేసిన ఆరోపణపై కేసు నమోదైంది. ఆర్‌ఎస్‌ఎస్‌పైనా, బీజేపీ నాయకుడు సుశీల్ కుమార్ మోదీపై చేసిన వ్యాఖ్యలతో దాఖలైన పరువు నష్టం కేసులతో గత వారం రాహుల్ గాంధీ ముంబయి, పాట్నా కోర్టులకు హాజరయ్యారు.