క్రైమ్/లీగల్

ఏసీబీ వలలో హెడ్‌కానిస్టేబుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎ కొండూరు, జూలై 10: ఆస్తి తగాదాలో ఒక వ్యక్తి నుండి 5వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ వైనం ఇది. ఏసీబీ డీఎస్‌పీ కనకరాజు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రమైన ఎ కొండూరు గ్రామానికి చెందిన మునగా ఉమామహేశ్వరరావు అతని అన్నదమ్ములు మునగా జగన్నాధం, వెంకటభాస్కరరావుల మధ్య ఆస్తి తగదా ఉంది. ఈవిషయమై పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగినప్పటికి సమస్య పరిష్కారం కాకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపధ్యంలో ఉమామహేశ్వరరావు గత నెల 26న అతని అన్నదమ్ములైన వెంకటభాస్కరరావు, జగన్నాధంలపై ఫిర్యాదు చేశారు. అతని ఫిర్యాదు మేరకు హెడ్ కానిస్టేబుల్ తెనాలి పాండురంగారావు కేసు నమోదు చేసి స్టేషన్ బెయిల్ మంజూరు చేసేందుకు 5వేలు లంచం అడిగినట్లు తెలిపారు. అందుకు తమ వద్ద అంత సొమ్ము లేదని చెప్పడంతో హెడ్‌కానిస్టేబుల్ మంగళవారం సాయంత్రానికల్లా డబ్బులు ఇస్తే బెయిల్ మంజూరు చేస్తానని, లేకుంటే తిరువూరు కోర్టుకు పంపుతానని బెదిరించడంతో బాధితుడు వెంకటభాస్కరరావు దిక్కుతోచని స్థితిలో ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. కానిస్టేబుల్ బాధితుడు నుండి 5వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్‌పీ కనకరాజు, సీఐ వెంకటేశ్వరరావు, కె వెంకటేశ్వరావు, హ్యాపీ కృపానందం, కెనడి, సిబ్బంది రెడ్ హ్యాండ్‌డగా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి అరెస్టు చేసి బుధవారం విజయవాడ కోర్టులో హాజరు పర్చినట్లు ఏసీబీ డీఎస్‌పీ కనకరాజు తెలిపారు.