క్రైమ్/లీగల్

60 మంది విదేశీయుల నిర్బంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నోయిడా (యూపీ), జూలై 10: గ్రేటర్ నోయిడాలో 60 మంది విదేశీయులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఎక్కువ మంది కాలం చెల్లిన వీసాలు కలిగి ఉన్నారని, గౌతమ్ బుద్ధనగర్ సీనియర్ పోలీస్ సూపరింటెండ్ వైభవ్ కృష్ణ పీటీఐకి తెలిపారు. కొంతమంది తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో వచ్చారని అన్నారు. మాదక ద్రవ్యాల సరఫరాకు పాల్పడుతున్నట్లు వచ్చిన ఆరోపణలకు విచారణ జరుపుతున్న సమయంలో అనధికారంగా దేశంలో ఉంటున్న 60 మందిని గుర్తించి అదుపులోకి తీసుకున్నామని, వీరిని కోర్టులో ప్రవేశపెట్టామని తెలిపారు. వీరిలో ఒకరు పిలీప్పీన్స్‌కు చెందిన వారుకాగా, మిగతా వారు ఆఫ్రికా ఖండంలోని వివిధ దేశాలకు చెందిన వారని తెలిపారు.