క్రైమ్/లీగల్

మేమే విచారిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 11: అయోధ్యలో రామమందిరం, బాబ్రీ మసీదు స్థల వివాదం పరిష్కారంలో మధ్యవర్తుల కమిటీతో ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదంటూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు గురువారం సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇప్పటి వరకూ ఉన్న పరిస్థితిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించింది. సమస్యకు సామరస్య పరిష్కారం చూపించని పక్షంలో జూలై 25 నుంచి కేసును రోజువారీ విచారణ జరుపుతామని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ప్రకటించింది. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి ఎఫ్‌ఎంఐ కలీఫుల్లా అధ్యక్షతన ఇద్దరు సభ్యులతో మధ్యవర్తుల కమిటీ పనిచేస్తోంది. ఈనెల 18నాటికి సమగ్ర నివేదిక ఇవ్వాలని కమిటీని కోర్టు ఆదేశించింది. ఒక వేళ సమస్యకు సామరస్యమైన పరిష్కారం చూపించని పక్షంలో తామే విచారించాల్సి వస్తుందని ధర్మాసనం అల్టిమేటం ఇచ్చింది. ‘ఈనెల 18 వరకూ మీ దగ్గరున్న సమాచారంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కలీఫుల్లా సారధ్యంలోని కమిటీని కోరుతున్నాం. దాన్ని పరిశీలించిన తరువాత మేం ముందుకెళ్తాం’అని న్యాయమూర్తులు బాబ్డే, డివై చంద్రచూడ్, అశోక్ భూషణ్, ఎస్‌ఏ నజీర్‌తో కూడిన ధర్మాసనం వెల్లడించింది. వచ్చే గురువారం నాటికి అప్పటి వరకూ ఉన్న సమాచారం మధ్యవర్తుల కమిటీ తమకు అందజేయాల్సి ఉంటుందని కోర్టు అల్టిమేటం ఇచ్చింది. ఆ తరువాతే తాము తదుపరి ఆదేశాలు ఇస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. అయోధ్య వివాదంపై నియమించిన మధ్యవర్తుల కమిటీతో ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదని రామ్‌లల్లా విరాజ్‌మన్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్ కమిటీ పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటి వరకూ ఆశించిన ప్రయోజనం కనిపించలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. ముస్లింల తరఫున కోర్టుకు హాజరైన సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ మాట్లాడుతూ మధ్యవర్తి కమిటీని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ కుట్రపూరితమైందని ఆరోపించారు. కమిటీ కార్యకలాపాలను అడ్డుకోవాలన్న దుర్బుద్ధితోనే పిటిషన్ వేశారని ఆయన అన్నారు. మధ్యవర్తి కమిటీని కొనసాగించాలని ధర్మాసనాన్ని ఆయన కోరారు. మధ్యవర్తుల కమిటీని తామే ఏర్పాటు చేశామని, ఇప్పటి వరకూ ఉన్న పరిస్థితులపై సమగ్ర నివేదికను కోరుతున్నట్టు ధావన్‌కు బెంచ్ స్పష్టం చేసింది. సీనియర్ న్యాయవాది కేఎస్ పరాశరన్ మాట్లాడుతూ కమిటీ పరిస్థితి చూస్తే అత్యంత సంక్లిష్టమైన ఈ సమస్యకు పరిష్కారం కొనుగొనడం కష్టంతో కూడుకున్నదేనని పేర్కొన్నారు. ప్యానల్ ఇప్పటి వరకూ ఎన్ని సార్లు సమావేశమైంది వెల్లడించాలన్న పరాశరన్ ‘వివాదాస్పద స్థలం విషయంలో సుప్రీం కోర్టే ఓ నిర్ణయం తీసుకోవాలి’అని కోరారు. కమిటీ పనితీరునే తప్పుపట్టడం సరైంది కాదని రాజీవ్ ధావన్ స్పష్టం చేశారు. వాద ప్రతివాదనలు జరుగుతుండగా ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ జోక్యం చేసుకుంటూ ‘జూలై 18లోగా సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా కమిటీని ఆదేశించాం’అని వెల్లడించారు. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి కలిఫుల్లా అధ్యక్షతన గల కమిటీలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్, సీనియర్ న్యాయవాది శ్రీరామ్ పంఛూ సభ్యులుగా ఉన్నారు.
చిత్రం... అయోధ్య భూ వివాద విచారణ అనంతరం గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్న న్యాయవాది విష్ణు శంకర్ జైన్