క్రైమ్/లీగల్

కూల్‌డ్రింక్‌లో నిద్రమాత్రలు వేసుకొని..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 11: నగరంలోని అంబర్‌పేట్ డీడీ కాలనీలో ఓ పంజాబీ కుటుంబ సభ్యులంతా కూల్‌డ్రింక్‌లో నిద్రమాత్రలు వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిలో తండ్రి మృతి చెందగా, ఇద్దరు పిల్లల పరిస్థితి విషమంగా మారింది. అపస్మారక స్థితిలో ఉన్న వీరు దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యాయత్నానికి కారణమని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంబర్‌పేట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపతున్నారు. కేసు పూర్తి వివరాల్లోకి వెళితే..పంజాబ్‌కు చెందిన పవన్ కార్భందా(65), నీలం కర్భందా(55) తన పిల్లలు కూతరు మన్ను (34), కుమారుడు నిఖీల్ (30)తో కలిసి జీవనం కొనసాగిస్తున్నారు. పవన్ ఎలక్ట్రికల్ షాప్‌లో పనిచేస్తున్నాడు. గత కొంత కాలంగా పవన్ భార్య నీలం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈనెల 9వ తేదీన మృతి చెందింది. నీలం మృతదేహం ఇంటికి వచ్చిన తరువాత తండ్రితో పాటు ఇద్దరు పిల్లలు కలిసి కూల్ డ్రింక్‌లో నిద్రమాత్రలు వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అప్పటికే తండ్రి పవన్ మృతి చెందాడు. గురువారం ఉదయం ఇంటి తలుపులు తీయకపోవడంతో ఇంటి యాజమాని 100కు డాయల్ చేసి పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటి తలుపులు తీసి చూసే సరికి పవన్‌తో పాటు అతని భార్య మృత దేహం పడివుంది. వారి ఇద్దరు పిల్లలు అపస్మారక స్థితిలో ఉన్నారు. వెంటనే పోలీసులు ఇద్దరు పిల్లలను చికిత్స నిమిత్తం దుర్గబాయ్ దేశ్‌ముఖ్ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలిసింది.