క్రైమ్/లీగల్

వ్యక్తి దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాంపల్లి, జూలై 20: నల్లగొండ జిల్లా నాంపల్లి మండల కేంద్రంలో శనివారం రాత్రి షేక్ సద్దాం(27) దారుణ హత్యకు గురయ్యాడు. అతని మిత్రులిద్దరూ ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. సద్దాంను తల నరికి హత్య చేశారు. మొండెం నుంచి తలను వేరు చేసి నేరుగా తలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి నిందితులు లొంగిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని నేరళ్లపల్లి గ్రామానికి చెందిన షేక్ సద్దాం(27)ను అదే గ్రామానికి చెందిన ఇమ్రాన్, గౌస్‌లు నడిరోడ్డుపై కొడవలితో నరికి దారుణంగా చంపేశారు. సద్దాం తలను చేతిలో పట్టుకుని నేగా నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. ఈబీభత్సకర దృశ్యాన్ని చూసి అవాక్కయన పోలీసులు వెంటనే తేరుకుని నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. వివాహితతో ఈ ముగ్గురికి ఉన్న సంబంధం ముగ్గురి మధ్య గొడవకు కారణమని పోలీసులు తేల్చారు. హతుడు, నిందితులు ముగ్గురు కూడా రోజూ గ్రామం నుంచి మాల్ గ్రామానికి పనులకు కలిసే వెళ్లేవారని పోలీసులు తెలిపారు. ముగ్గురికీ తాగుడు, గంజాయి అలవాటు ఉండేవారని వారు వెల్లడించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు.