క్రైమ్/లీగల్

కబ్జా కేసులో ఒకరి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, జూలై 21: ఇతరుల ప్లాటును కబ్జా చేసి తప్పించుకు తిరుగుతున్న ఓ వ్యక్తిని ఉప్పల్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో మరో నలుగురి కోసం గాలిస్తున్నట్లు ఎస్‌ఐ వెంకటకృష్ణ తెలిపారు. ఉప్పల్ స్వరూప్‌నగర్‌లోని సర్వే నెంబర్ 56లో ఎన్‌ఆర్‌ఐ మద్దూరి విజయలక్ష్మికి చెందిన వెయ్యి గజాలలో 500 గజాల స్థలాన్ని కబ్జా చేసినట్లు ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాచారం హెచ్‌ంటీఏలో నివసిస్తున్న కే.రఘునందన్‌ను అరెస్టుచేసి రిమాండ్ చేసినట్లు పేర్కొన్నారు. కేసులో రమేశ్, అరుణ అల్కాల్, కిరణ్ కుమార్, భాస్కర్, సంతోష్ కుమార్ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.