క్రైమ్/లీగల్

హత్య కేసులో ముగ్గురి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తూరు రూరల్, జూలై 22: యువకుడి హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సోమవారం కొత్తూరు పోలీస్ స్టేషన్‌లో విలేఖరుల సమావేశాన్ని నిర్వహించారు. రూరల్ సీఐ రామకృష్ణ మాట్లాడుతూ జూలై 16వ తేదిన కొత్తూరు మండలం ఇన్ముల్‌నర్వ గ్రామ శివారులోని ఓ వెంచర్‌లో ఇస్మాయిల్ (23) అనే యువకుడిని బ్యాట్‌తో కొట్టి చంపినట్లు వివరించారు. హైదరాబాద్‌లోని కిషన్‌బాగ్‌కు చెందిన అనిషాబేగంను కొత్తూరు మండలం ఇన్ముల్‌నర్వ గ్రామానికి చెందిన ఇస్మాయిల్ అనే వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. అనిషాబేగానికి వివాహం కాకముందు నుంచి కిషన్‌బాగ్‌కు చెందిన జహీర్ అనే యువకుడితో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనిషాబేగం, ప్రియుడు జహీర్ మధ్య భర్త ఇస్మాయిల్ అడ్డుగా ఉన్నాడనే నేపంతో ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశ్యంతో పథకం పన్నారు. అనిషాకు దూరపు బంధువు (13) సంవత్సరాల బాలుడు ఇస్మాయిల్, జహీర్ మధ్య స్నేహ సంబంధాలు ఏర్పాటు చేశారు. దాంతో ఇరువురు స్నేహపూర్వకంగా కలిసి ఉండేవారు. 2019 జూలై 16వ తేది రాత్రి సమయంలో ఇన్ముల్‌నర్వ గ్రామ శివారులో ఉన్న ఓ వెంచర్‌లో అతిగా మద్యం సేవించి జహీర్ అనే యువకుడు ఇస్మాయిల్ అనే వ్యక్తిని బ్యాట్‌తో తలపై మోది హత్య చేసినట్లు సీఐ వివరించారు. ఇస్మాయిల్‌ను హత్య చేసి అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు. గ్రామంలో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగానే నింధితులను పట్టుకున్నట్లు వివరించారు. సోమవారం ఉదయం కొత్తూరు నాట్కో జంక్షన్ వద్ద 44వ జాతీయ రహదారిపై వాహనాల తనిఖీ నిర్వహిస్తున్న సమయంలో నిందితులు పట్టుబడినట్లు సీఐ రామకృష్ణ తెలిపారు. హత్య కేసును త్వరగా చేదించినందుకు ఐడీపార్టీ పోలీసులు నరేందర్, శివకుమార్, రవీందర్, శేఖర్‌ను అభినందించారు. సమావేశంలో కొత్తూరు ఎస్‌ఐ కృష్ణ ఉన్నారు.