క్రైమ్/లీగల్

ఇంటర్ విద్యార్థినిపై లెక్చరర్ అత్యాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎ కొండూరు, జూలై 22: విద్యార్థినికి మాయ మాటలు చెప్పి, కిడ్నాప్ చేసి ఆపై అత్యాచారం చేసిన సంఘటన ఇది. ఎస్సీ ఎస్టీ సెల్ అట్రాసిటీ సెల్ డీఎస్పీ విజయరావు తెలిపిన వివరాలు ప్రకారం కంభంపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్న బాలికతో అదే కళాశాలలో కాంట్రాక్టు లెక్చరర్‌గా పనిచేస్తున్న మంకెన గోపీకృష్ణ కొద్ది కాలంగా సన్నిహితంగా ఉంటున్నాడు. ఈ నెల 15న మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేశాడు. అనంతరం బాలికపై అత్యాచారం జరిపి, కులం పేరు పెట్టి దూషించినట్లు డిఎస్‌పి విజయరావు తెలిపారు. ఈ విషయంపై బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. లెక్చరర్‌ను రిమాండ్‌కు పంపామని అన్నారు. బాధితురాలిని తిరువూరు చైల్డ్ హోమ్‌కు పంపామని తెలిపారు.