క్రైమ్/లీగల్

కన్న తల్లిని వేధించిన కొడుకు, కోడలికి రెండేళ్లు జైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేరేడ్‌మెట్, జూలై 22: వృద్ధాప్యంలో కన్నతల్లిని గౌరవంగా చూసుకుని, అవసరాలు చూడాల్సిన కొడుకు భార్యతో కలిసి తల్లిని వేధించి ఇంట్లో నుండి బయటకు పంపించేందుకు ప్రయత్నించిన కొడుకుకి, అతడి భార్యకు రెండేళ్లు జైలు శిక్ష, 10వేల జరిమానా విధిస్తూ మల్కాజిగిరి కోర్టు సోమవారం తీర్చు ఇచ్చింది. నేరేడ్‌మెట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నేరేడ్‌మెట్ పరిధిలోని హిల్‌కాలనీలో నివాసం ఉండే ప్రేమ కుమారి (70)కి ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. పిల్లలందరి పెళ్లిళ్లు చేసిన తర్వాత 2015లో భర్త చనిపోవడంతో పెద్ద కుమారుడు అమిత్‌కుమార్ వద్ద వుంటుంది. అమిత్ భార్యతో కలసి ప్రేమకుమారిని వేధింపులకు గురి చేసినట్టు పోలీసులు తెలిపారు. దీంతో 2015లో బాధితురాలు నేరేడ్‌మెట్ పోలీసులను ఆశ్రయించడంతో వారు కేసు నమోదు చేశారు. నాలుగు సంవత్సరాలు కోర్టులో కేసు నడిచిన తర్వాత సోమవారం తీర్పు వచ్చినట్టు నేరేడ్‌మెట్ సీఐ తెలిపారు. అమిత్ కుమార్, అతడి భార్య లావణ్యకు రెండు సంవత్సరాలు జైలు శిక్ష, పది వేల రూపాయల జరిమాన విధిస్తూ మల్కాజిగిరి కోర్టు తీర్పు ఇచ్చినట్టు తెలిపారు.