క్రైమ్/లీగల్

తండ్రిపై కోపం.. సోదరిపై అత్యాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మవరం, జూలై 22: తండ్రి రెండోపెళ్లి చేసుకున్నాడన్న కోపంతో వావివరసలు మరిచి మారుతల్లి కూతురుపై అత్యాచారం జరిపాడు ఓ ప్రబుద్దుడు. ఈ దారుణం అనంతపురం జిల్లా ధర్మవరంలో ఆదివారం రాత్రి జరిగింది. బాధితురాలి ఫిర్యాదుమేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ధర్మవరం పట్టణానికి చెందిన తేజప్రతాప్ బేల్దారి పని చేసుకుంటూ తల్లితో కలిసి ఉంటున్నాడు. అతని తండ్రి రెండవ పెళ్లి చేసుకుని కొత్తచెరువులో నివాసం ఉంటున్నాడు. మారుతల్లికి ఓ కూతురు(14) ఉంది. తండ్రి రెండో పెళ్లి చేసుకుని తమను నిర్లక్ష్యం చేశాడని తేజప్రతాప్ కక్ష పెంచుకున్నాడు. ధర్మవరం పట్టణంలోని ఓ బట్టల దుకాణంలో పనిచేస్తున్న మారుతల్లి కూతురు ఆదివారం రాత్రి ఇంటికి వెళ్తుండగా మాటలు కలిపిన తేజప్రతాప్ తన ఇంటికి తీసుకువెళ్లి అత్యాచారం జరిపాడు. రాత్రి పొద్దుపోయాక బాధితురాలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కొత్తచెరువులో తలదాచుకున్న నిందితుడు తేజప్రతాప్‌ను సోమవారం అరెస్ట్ చేశారు. నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.