క్రైమ్/లీగల్

మరణంలోనూ వీడని స్నేహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గూడెంకొత్తవీధి, జూలై 22: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా తవ్విన చెరువులో ఈతకు వెళ్ళిన ఇద్దరు గిరిజన విద్యార్థులు మృతి చెందారు. విశాఖ జిల్లా గూడెంకొత్తవీది మండలం దామనాపల్లి పంచాయతీ లింగవరంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. బాగా మారుమూల గ్రామం కావడంతో విషయం సోమవారం వెలుగుచూసింది. మృతి చెందిన వారిలో సాగిన జానకి జతిన్(9) చింతపల్లిలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో మూడో తరగతి చదువుతున్నాడు. మరో విద్యార్థి కంకిపాటి గిరి వర్దన్(9) లింగవరం ప్రభుత్వ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. ఆదివారం కావడంతో కుటుంబ సభ్యులతో కలిసి దగ్గర్లో ఉన్న పొలం పనులకు వెళ్ళిన వీరిద్దరూ ఆడుకుంటూ ఉపాధిహామీ పథకంలో తీసిన చెరువు దగ్గరకు వెళ్ళినట్లు గ్రామస్తులు తెలిపారు. దగ్గర్లో ఉన్న పొలం పనులు చేసుకుంటున్న తల్లిదండ్రులకు ఈవిషయం తెలియలేదు. సాయంత్రం అయినప్పటికీ పిల్లలు ఇంటికి తిరిగి రాకపోవడంతో గ్రామస్తులు, కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికారు. అప్పటికే చెరువులో పడి కొట్టుకుంటున్న ఇద్దరు చిన్నారులను హుటాహుటిన చెరువులో దిగి రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం దక్కలేదని గ్రామస్థులు తెలిపారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
మరణంలోనూ..
వరుసకు బావ బావమర్ది అయిన జానకి జతిన్, గిరివర్దన్ చిన్ననాటి నుండి కలిసిమెలిసి తిరిగేవారు. ఆరు నెలల క్రితం ఇద్దరూ ముచ్చట పడి ఫొటో కూడా తీయించుకున్నారని గ్రామస్థులు తెలిపారు. భవిష్యత్‌లో తమకు ఆసరాగా ఉంటారనుకున్న చిన్నారులు చెరువులో పడి మృతి చెందడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గూడెంకొత్తవీధి ఎంఈవో భూషణ్ సంఘటనా స్థలానికి వెళ్ళి విద్యార్థుల కుటుంబీకులను పరామర్శించారు.