క్రైమ్/లీగల్

కట్టుకథలు చెప్పొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 22: ఎర్రమంజిల్ భవనాల కూల్చివేత యోచనపై ప్రభుత్వం కట్టుకథలు చెప్పవద్దని, ఉన్నతంగా ఆలోచించి కోర్టు ముందు వాస్తవాలు చెప్పాలని హైకోర్టు సోమవారం నాడు తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. పురావస్తు జాబితాలో ఎర్రమంజిల్ భవనం లేదని చెప్పిన ప్రభుత్వం, కొద్ది రోజుల క్రితం ఎందుకు తొలగించాల్సి వచ్చిందనే దానికి సరైన వివరణ ఇవ్వలేకపోయింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ , జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం నాడు ఎర్రమంజిల్ భవనాల కూల్చివేయాలన్న ప్రభుత్వ యోచనపై దాఖలైన 8 ప్రజావాజ్య పిటిషన్లపై విచారణ కొనసాగించింది. హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ జోనింగ్ రెగ్యులేషన్స్ 1981 రెగ్యులేషన్ 13కు రాష్ట్ర ప్రభుత్వం జీవో 183 ద్వారా 2015లో సవరణలు చేసిందని, దాంతో నేడు రెగ్యులేషన్ 13 వాడుకలో లేదని అదనపు అడ్వకేట్ జనరల్ జే రామచంద్రరావు న్యాయమూర్తులకు వివరించారు. జీవోలో రెగ్యులేషన్ 13 రద్దయినట్టు ఏమీ ప్రభుత్వం పేర్కొనలేదని, కట్టుకథలు అప్పటికపుడు ఎందుకు పుట్టుకొస్తున్నాయని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. ప్రభుత్వం కోర్టుకు సమర్పించిన పత్రాల్లో ఈ విషయాలేమీ ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించి అంత లోతుగా న్యాయస్థానం తరచి చూడాల్సిన పనే్లదని పేర్కొనగా, తీవ్రంగా స్పందించిన ప్రధాన న్యాయమూర్తి న్యాయస్థానాల అధికారాలను అడ్డుకట్ట వేయాలని చూడొద్దని అన్నారు.