క్రైమ్/లీగల్

కాలువలోకి దూసుకుపోయిన స్కూటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మలికిపురం, జూలై 23: తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండలం గుడిమెళ్ళంక వద్ద మంగళవారం ఉదయం స్కూటరు కాలువలోకి దూసుకెళ్లిన ప్రమాదంలో ఇద్దరు బాలికలు, మరో యువతి మృతిచెందారు. మృతిచెందిన బాలికలిద్దరూ అక్కాచెల్లెళ్లు కాగా, మృతిచెందిన యువతి వారికి పెద్దమ్మ. ఈ ప్రమాదం నుండి బాలికల తల్లి, మరో యువకుడు సురక్షితంగా బయటపడ్డారు. వివరాలిలావున్నాయి... పశ్చిమ గోదావరి జిల్లా కాజ గ్రామానికి చెందిన వడ్లమాని శివనాగేశ్వరరావు తమ బంధువులైన పట్నాల కృప (25) మేడూరి సుగుణ (23), సుగుణ కుమార్తెలు భాగ్య రాజేశ్వరి (5), కిరణ్మయి (4)తో కలిసి స్కూటర్ (బజాజ్ ప్లెజర్)పై గుడిమెళ్లంక వస్తున్నారు. గ్రామ సరిహద్దుల్లో అదుపుతప్పిన వాహనం గన్నవరం పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో శివనాగేశ్వరరావు, సుగుణ సురక్షితంగా గట్టుపైకి చేరుకున్నారు. కృప, భాగ్యరాజేశ్వరి, కిరణ్మయి గల్లంతయ్యారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. తొలుత కృప, కిరణ్మయి మృతదేహాలు లభించగా, సాయంత్రానికి భాగ్యరాజేశ్వరి మృతదేహం లభించింది. అమలాపురం డీఎస్పీ మాస్మ్ బాషా, రాజోలు సీఐ వి కృష్ణ, మలికిపురం ఎస్సై కేవీ రామారావు సంఘటనాస్థలానికి చేరుకుని గాలింపు చర్యలను పర్యవేక్షించారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు.