క్రైమ్/లీగల్

మన్యంలో మావోల డంప్ లభ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీతంపేట, జూలై 23: గడచిన కొనే్నళ్లుగా ప్రశాంతంగా ఉన్న శ్రీకాకుళం జిల్లా సీతంపేట మన్యంలో మావోల డంప్ కలకలం రేపింది. ఇటీవలి కాలంలో ఎస్పీ ఆర్‌ఎన్ అమ్మిరెడ్డి జిల్లాలో మావోల కదలికలు లేవని చెప్పిన కొద్దిరోజుల్లోనే ఏజెన్సీ ప్రాంతంలో మావోలకు చెందిన డంప్ దొరకడం చర్చనీయాంశమైంది. సీతంపేట ఏజెన్సీ ప్రాంతంలోని దోనుబాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని మీనకోట అటవీ ప్రాంతంలో ఈ డంప్‌ను పోలీసులు మంగళవారం గుర్తించారు. మీనకోట అటవీ ప్రాంతంలో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో 6 ల్యాండ్‌మైన్లు, 1 నాటు తుపాకీని మావోలు భూమిలో పాతిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. సీతంపేట ఏజెన్సీ పరిధిలోని పూతికవలస, మర్రిపాడు, దోనుబాయి వంటి ప్రాంతాల్లో మావొయిస్టుల అలజడి ఉండేది. అయితే చాలా ఏళ్ల క్రితం నుండి పోలీసులు వరుస కూంబింగ్‌లు నిర్వహించడంతో ఈ ప్రాంతాల్లో మావోల సంచారం తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో మంగళవారం మీనకోట అటవీప్రాంతంలో మావోల డంప్ దొరకడంతో మన్యంలో అలజడి నెలకొంది. ఈ ప్రాంతంలో డంప్ దొరకిందంటే మావోల కదలికలు సీతంపేట ఏజెన్సీలో మళ్లీ మొదలయ్యాయని గిరిజనులు భీతిల్లుతున్నారు.

చిత్రం...పోలీసులు గుర్తించిన మావోయిస్టుల డంప్