క్రైమ్/లీగల్

‘బలపరీక్ష’ పిటిషన్‌ను ఉపసంహరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 24: కర్నాటక రాజకీయాల్లో మూడు వారాల పాటు సాగిన సంక్షోభానికి తెరపడిన నేపథ్యంలో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు తమ పిటిషన్ ఉపసంహరించుకొంటున్నామని సుప్రీంకోర్టుకు తెలియజేశారు. కుమారస్వామి విశ్వాస తీర్మానాన్ని ఉటంకిస్తూ అసెంబ్లీ స్పీకర్ కేఆర్ రమేష్‌కుమార్ తక్షణమే బలపరీక్ష నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఆర్ శంకర్, హెచ్ నగేష్‌లు సుప్రీంను ఆశ్రయించారు. మంగళవారం జరిగిన బలపరీక్ష నేపథ్యంలో కుమారస్వామి ప్రభుత్వానికి 99 మందే మద్దతు పలకడంతో విశ్వాస తీర్మానం వీగిపోయిన సంగతి తెలిసిందే. సుప్రీం చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలో జస్టిస్ దీపక్ గుప్తా, అనిరుద్ధ బోస్‌లు బుధవారం స్వతంత్ర అభ్యర్థుల ఉపసంహరణ విజ్ఞప్తిని విచారించారు. స్వతంత్ర అభ్యర్థుల తరఫు న్యాయవాది ముకుల్ రహ్‌తోగి, స్పీకర్ కుమార్ తరఫు న్యాయవాది ఏఎం సింగ్వీలు ఎక్కడ? అని బెంచ్ ప్రశ్నించారు. సీనియర్ న్యాయవాదులు లేకుండా తీర్పు వెలువరించలేమని సుప్రీం బెంచ్ స్పష్టం చేసింది. కర్నాటకలో సంక్షోభం నెలకొన్న సందర్భంలో బలపరీక్షకు కుమారస్వామి సిద్ధమైనప్పుడు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోవడాన్ని ఉటంకిస్తూ ఇద్దరు ఎమ్మెల్యేలూ తక్షణమే బలపరీక్ష నిర్వహించేలా స్పీకర్‌ను ఆదేశించాలని సుప్రీం కోర్టును అభ్యర్థించిన సంగతి తెలిసిందే. కొన్ని కీలక నిర్ణయాలతో పాటు పోలీసు అధికారులను సైతం కుమారస్వామి ప్రభుత్వం బదిలీలు చేస్తోందనీ.. దీనిని కట్టడి చేసేందుకు వెంటనే బలపరీక్ష అనివార్యమని ఇద్దరు ఎమ్మెల్యేలూ కోర్టును కోరారు.