క్రైమ్/లీగల్

ఇసుక తవ్వకాలపై మీ వైఖరి ఏమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 24: ఇసుక అక్రమ తవ్వకాలు, లీజు ఒప్పందాల ఉల్లంఘనలపై దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌కు సుప్రీంకోర్టు స్పందించింది. కేంద్రం సహా ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలపై దర్యాప్తు నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ ఎస్ బాబ్డే విచారణకు స్వీకరించింది. తొలుత ఈ అంశాన్ని హైకోర్టులో తేల్చుకోవాలని పిటిషనర్ ఎం.అలగస్వామి తరఫు న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌కు బుధవారం సూచించినప్పటికీ సుప్రీం విచారణకు స్వీకరించింది. ఇసుక తవ్వకాలపై వచ్చిన ఫిర్యాదులపై స్పందించాల్సిందిగా కేంద్రం, ఐదు రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిన ఐదు రాష్ట్రాల్లో తమిళనాడు, పంజాబ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంద్రప్రదేశ్ ఉన్నాయి. ఇసుక తవ్వకాల కారణంగా పర్యావరణ సమతుల్యం దెబ్బతినే ప్రమాదం ఉన్న దృష్ట్యా తక్షణమే దీనిపై చర్య తీసుకోవాలని కోరుతూ పిటిషనర్ సుప్రీంకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. తొలుత హైకోర్టు ఈ అంశంపై స్పందించి వివరణ ఇస్తే మేము అవసరమైన నిర్ణయాలు తీసుకొనే అవకాశాలు ఉంటాయని సుప్రీం బెంచ్ పేర్కొన్నప్పటికీ.. జరిగే ‘పర్యావరణ విధ్వంసాన్ని’ దృష్టిలో ఉంచుకొని విచారణకు సుప్రీం స్వీకరించింది. వాదోపవాదనల అనంతరం కేంద్రం సహా ఐదు తెలుగు రాష్ట్రాలూ పిటిషన్‌పై స్పందించి వివరణలు ఇవ్వాలని సుప్రీంకోర్టు బెంచ్ ఆదేశాలు జారీ చేసింది.