క్రైమ్/లీగల్

గుర్తు తెలియని వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం, ఏప్రిల్ 8: స్థానిక రైల్వేస్టేషన్ ప్రాంగణంలో ఉన్న ఇంజనీరింగ్ కార్యాలయం ఎదుట ఓ గుర్తు తెలియని వ్యక్తి (45) మృతి చెందాడు. మృతుడు నీలం రంగు టీషర్టు, లైట్ బ్లూ కలర్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. మృతుడి ఆచూకీ తెలిసిన వ్యక్తులు టూటౌన్ పోలీసులను సంప్రదించాలని సూచించారు. ఈ మేరకు టూటౌన్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

వ్యక్తి ఆత్మహత్య
గుడిబండ, ఏప్రిల్ 8 : మండల పరిధిలోని దినే్నహట్టికి చెందిన కరియప్ప అలియాస్ దొన్నప్ప (55) జీవితంపై విరక్తి చెంది ఆదివారం చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. కరియప్పకు దాదాపు రూ.2.50 లక్షల వరకు అప్పులు ఉన్నాయి. దీనికితోడు అనారోగ్యంతో బాధపడుతూ జీవితంపై విరక్తి చెంది ఆదివారం సాయంత్రం గ్రామ సమీపంలోని చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా ఎస్‌హెచ్‌ఓ సుధాకర్ కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మడకశిర ప్రభుత్వాసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.