క్రైమ్/లీగల్

మండపేటలో కిడ్నాప్ కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మండపేట : తూర్పు గోదావరి జిల్లా మండపేట పట్టణంలో నాలుగేళ్ల బాలుడు జషిత్ కిడ్నాప్ ఉదంతం రాష్టవ్య్రాప్త సంచలనం సృష్టిస్తోంది. సోమవారం రాత్రి నానమ్మతో కలిసి ఇంట్లోకి వెళుతున్న బాలుడిని బైక్‌పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు బలవంతంగా ఎత్తుకెళ్లిపోయారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగినా ఫలితం లేకపోయింది. కిడ్నాప్ ఉదంతం జరిగి రెండు రోజులు గడుస్తున్నా ఎటువంటి ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. బాలుడి తల్లిదండ్రులు బ్యాంకు ఉద్యోగులు కావడం, వారికి ఎవరితోనూ శతృత్వాలు లేవని తెలపడంతో దర్యాప్తు క్లిష్టమయ్యింది. బాలుడి ఆచూకీ కనిపెట్టడానికి తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ అద్నాం నరుూం అస్మీ 17 బృందాలను ఏర్పాటుచేశారు. రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా పోలీసుల సహకారం సైతం తీసుకుంటున్నారు. కిడ్నాప్ జరిగిన ఇంటికి సమీపంలోని ఒక ఇంటికి ఈ నెల 3వ తేదీన ఇద్దరు యువకులు బైక్‌పై వచ్చి, అద్దె ఇంటికోసం వాకబుచేశారు. ఈ విషయం అక్కడి సీసీ టీవీలో రికార్డయ్యింది. టోపీలు ధరించి, ముఖానికి కర్చ్ఫీలు కట్టుకుని ఉన్న వీరిపై అనుమానంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తుచేస్తున్నారు. ఇది బాలుడి కిడ్నాప్ కోసం జరిగిన రెక్కీగా పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్‌రెడ్డి, ఎస్పీ నరుూం అస్మీ బుధవారం మండపేట వచ్చి, బాలుడి తల్లిదండ్రులను పరామర్శించారు.

చిత్రం..బాధిత కుటుంబీకులను పరామర్శిస్తున్న ఎస్పీ, కలెక్టర్