క్రైమ్/లీగల్

కొత్త భవనం ఎందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 24: సకల సదుపాయాలతో ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ భవనాన్ని కాదని, కొత్తగా అసెంబ్లీ భవనం నిర్మించాల్సిన అవసరం ఏమొచ్చిందని రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం ఎర్రమంజిల్ భవనం కూల్చివేతకు హెచ్‌ఎండీఏ నుండి అనుమతి తీసుకున్నారా? అని ప్రశ్నించింది. అనుమతిపై అడిగిన ప్రశ్నకు బదులివ్వడానికి ఇన్ని రోజులా అంటూ ధర్మాసనం నిలదీసింది. హుడా చట్టం ప్రకారం ఎర్రమంజిల్ భవనాలకు రక్షణ ఉందని, హుడా స్థానంలో వచ్చిన హెచ్‌ఎండీఏ అనుమతి తీసుకోవాలి కదా అని ప్రశ్నించింది. అనుమతి తీసుకున్నారో లేదో చెప్పడానికి ఇంత జాప్యం ఎందుకు చేస్తున్నారని అడిగింది. అసెంబ్లీ నిర్మాణం కోసం ఎర్రమంజిల్‌లో భవనాలను కూల్చివేయవద్దంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై హైకోర్టు
విచారణ కొనసాగించింది. ఎర్రమంజిల్ భవనాలకు చారిత్రక వారసత్వ కట్టడాల పరిరక్షణ లేదని, గతంలోని దానికి సంబంధించిన హుడా నిబంధనలను తొలగించామని ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు చెప్పారు. అసెంబ్లీ, సచివాలయం నిర్మాణ కేసుపై తదుపరి విచారణను ఉన్నన న్యాయస్థానం గురువారానికి వాయిదా వేసింది.