క్రైమ్/లీగల్

అంతర్రాష్ట్ర దోపిడీ ముఠా అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, జూలై 24: సిగరేట్ లైటర్‌ని తుపాకీగా చూపించి 3.6 కోట్ల రూపాయలను దోచుకెళ్లారు. యజమాని లావాదేవీలు చూసిన కారు డ్రైవరే ముఠాను ఏర్పాటు చేసి దోపిడీకి పథకం వేశాడు. మొదటి ప్రయత్నంలో విజయం సాధించడంతో రెండోసారి దోపిడీకి పథకం వేసిన నిందితులను జహీరాబాద్‌లో కాపుకాసి సైబరాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 3.6 కోట్ల రూపాయల విలువ చేసే నగదు బంగారు ఆభరణాలను స్వాధీనం చేసున్నారు. గత నెల 28న షాద్‌నగర్‌లో దారిదోపిడీకికి పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. జాతీయ రహదారులపై దోపిడీకి పాల్పడుతున్న ఏడుగురు సభ్యుల ముఠాను శంషాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 3.6 కోట్ల రూపాయల విలువ చేసే నగదు బంగారు ఆభరణాలతో పాటు బొమ్మ తుపాకినీ స్వాధీనం చేసుకున్నట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. గచ్చిబౌలిలోని కమిషనరేట్ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ముఠా వివరాలను వెల్లడించారు. మహారాష్టల్రోని కారాడ్ మంగళవారిపేటకు చెందిన భోస్లీ విశ్వజిత్ చంద్రకాంత్(21), మయూరేష్ మనోహర్ పిశాల్(22), సుజాతల రమేష్ ఘారే(35), ఆకాశ్ కాంబ్లే(23) సన్నీ చావాన్(21), ఆకాశ్ దీపక్ రాథోడ్ (20) సునీత చంద్రకాంత్ భోస్లీ ముఠాగా ఏర్పాడి దోపిడీ చేసినట్లు సీపీ తలిపారు. గత నెల 28న షాద్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని దశ్మషే దాబా సమీపంలో గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు బొమ్మ తుపాకీతో డ్రైవర్‌ని బెదిరించి కారును తీసుకెళ్లినట్లు ఫిర్యాదు వచ్చిందని పేర్కొన్నారు.
ముంబయికి చెందిన రాజు నాన్గరే.. బంగారం వ్యాపారి. అతని వద్ద రాహుల్ కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడని అన్నారు. రాజు నాన్గరే కేరళ నుంచి బంగారం తక్కువ ధరకు తీసుకొచ్చి నగరాల్లో షాపులకు అమ్మి సోమ్మును తీసుకువెళ్లేవాడని చెప్పా. ప్రతి సారి కోట్ల రూపాయలు లావాదేవీలు నాన్గరే చేస్తాడని సీపీ వివరించారు. నాన్గరే బంగారం డబ్బును తరలించేందుకు తన బ్రెజ్జా వాహనంలో సీట్ల కింద ప్రత్యేకంగా తయారు చేయించుకున్నాడని తెలిపారు. దొంగతన జరిగిన డ్రైవర్ రాహుల్.. డబ్బున్న విషయం చెప్పాలేదని యజమాని నాన్గరేను విచారించగా కారులో 3.6 కోట్ల రూపాయలు ఉన్నట్లు చెప్పినట్లు తెలిపారు. శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి, ఎస్‌ఓటీ ఏడీసీపీ దయానంద్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారని చెప్పారు. గతంలో నాన్గరే వద్ద కారు డ్రైవర్‌గా పని చేసిన మయూరేష్ మనోహర్.. నాన్గరే వ్యాపార లావాదేవిలు గురించి తెలుసుకుని సెలవుపై వెళ్లి దోపిడీకి పథకం వేసినట్లు చెప్పారు. చేపల వ్యాపారం చేస్తున్న సుజాత వద్ద మనోపన్ పని చేశాడని సీపీ వివరించారు. సుజాతతో నాన్గరే వ్యాపారం గురించి చెప్పడంతో దోపిడీకి పథకం వేశారని పేర్కొన్నారు. 26న జహీరాబాద్‌లో విశ్వజిత్, ఆకాశ్ కాంబ్లే, సన్నీ చావాన్, ఆకాష్ దీపక్ మాటు వేశారు. 26న ప్రయత్నం విఫలం కావడంతో 28న బాలనగర్ బూర్గుల వద్ద డ్రైవర్‌ని బొమ్మ తుపాకీతో బెదిరించి దోపిడీకి పాల్పడినట్లు సీపీ తెలిపారు. నిందితుల నుంచి రెండు కోట్ల 89లక్షల 33800 రూపాయలు నగదు, 35తులాల బంగారు ఆభరాణలు, ఒక డమీ తుపాకీ, ఎనిమిది మొబైల్ ఫోన్లతో పాటు ఒక బ్రెజ్జా కారును స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు. థానే రైల్వే స్టేషన్‌లో సిగరేట్ వెలుగించే తుపాకీ మాదిరిగా ఉన్న లైటర్ కొనుగోలు చేసి దోపిడీకి పాల్పడారని సీపీ చెప్పారు. కార్యక్రమంలో శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి, ఎస్‌ఓటీ ఏడీసీపీ దయానంద్ రెడ్డి పాల్గొన్నారు. నిందితులను అరెస్టు చేసిన ఎస్‌ఓటీ పోలీసుకు సీపీ రివార్డు అందించారు.