క్రైమ్/లీగల్

‘బిగ్‌బాస్’ చానెల్‌కు పోలీసుల నోటీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 24: బిగ్‌బాస్ కార్యక్రమంపై ఫిర్యాదుల నేపథ్యంలో బంజారాహిల్స్‌లోని స్టార్‌మా కార్యాలయ అడ్మిన్ హెడ్ శ్రీ్ధర్‌కు బంజారాహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. బిగ్‌బాస్ ఇన్‌చార్జి శ్యాంతో పాటు రవికాంత్, రఘు, శశికాంత్‌లపై ఈనెల 13న బంజారాహిల్స్ పోలీసులకు పాత్రికేయురాలు శే్వతారెడ్డి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. బిగ్‌బాస్ ఒప్పంద వ్యవహారంతో పాటు కాస్టింగ్ కౌచ్‌పై ఆరోపణలు చేశారు. బంజారాహిల్స్ పోలీసులు శ్యాంతోపాటు రవికాంత్, రఘు, శశికాంత్‌లపై కేసులు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా వివరాలు సేకరించేందుకు స్టార్ మా అడ్మిన్ హెడ్ శ్రీ్ధర్‌కు 91, 160 సీఆర్‌పీసీ కింద పోలీసులు నోటీసులు అందజేశారు. ఒప్పందం వ్యవహారం, ఎంపికకు ఉన్న నిబంధనలు శ్యాంతో పాటు మిగిలిన ముగ్గురి పాత్ర తదితర అంశాలపై మూడు రోజుల్లో సమాధానం ఇవ్వాలని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. నోటీసులపై స్పందించిన శ్రీ్ధర్ ఉన్నత స్థాయిలో చర్చించి రెండు రోజుల్లో సమాధానమిస్తామని పోలీసులకు తెలిపాడు.