క్రైమ్/లీగల్

ఐదుగురు బలవన్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ టౌన్/మల్యాల : వివిధ కారణాలతో రెండు జిల్లాల్లో ఐదుగురు మృతి చెందారు. ఆర్థిక ఇబ్బందులతో నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం సంతోష్‌నగర్‌లో ఇద్దరు, జగిత్యాల జిల్లా మల్యాల మండలం సర్వాపూర్ (కొత్తపల్లె) గ్రామంలో ముగ్గురు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మిర్యాలగూడ సంతోష్‌నగర్‌కు పారేపల్లి లోకేష్ రైస్‌మిల్లులో చిన్నపాటి ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమవుతున్నాడు. ఆర్థిక ఇబ్బందులు తీవ్రం కావడంతో మంగళవారం రాత్రి తన భార్య చిత్రలేఖ, కుమారుడు లోహిత్‌లకు థమ్స్‌అప్‌లో పురుగుల మందు కలుపుకొని తాగించి తాను తాగాడు. ఆత్మహత్యాయత్నానికి కొద్దిసేపటి ముందు లోకేష్ హైద్రాబాద్‌లో ఉన్న తన సోదరికి ఫోన్ చేసి తన ఆర్థిక పరిస్థితి బాగా లేదని, తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పాడు. ఆమె వెంటనే నల్లగొండలో ఉంటున్న మరో సోదరికి ఫోన్ చేసి వివరించింది. వెంటనే వారు డయల్ 100 నెంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన లోకేష్ ఇంటికి చేరుకున్నారు. అప్పటికే అతని భార్య చిత్రలేఖ (40), పెద్ద కుమారుడు లోహిత్ (12) చనిపోయ ఉన్నారు. లోకేష్ అపస్మారక పరిస్థితిలోకి వెళ్లాడు. లోకేష్‌ను పోలీసులు డాక్టర్స్ కాలనీలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. లోకేష్ కొన్నాళ్లుగా వేరే ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. సరైన ఉద్యోగం లేకపోవడంతో తండ్రి సురేందర్ తన ఇంట్లో ఉండాల్సిందిగా కోరడంతో ఈనెల 1న ఇంట్లోకి వచ్చాడని కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది.
నిద్రమత్తు ఒకరి ప్రాణం కాపాడింది
అర్థరాత్రి నిద్రమత్తులో ఉన్న లోకేష్ తన చిన్న కుమారుడు రోహిత్‌కు నువాక్రాన్ పురుగుల మందు కలిపిన థమ్స్‌అప్ తాగమని ఇవ్వగా అతను నిద్ర మత్తులో నిరాకరించాడు. దాంతో ముగ్గురు తాగారని కుటుంబ సభ్యులు తెలిపారు.
రోహిత్ నిద్రమత్తులో ఉండటం వల్ల మృత్యువు నుండి బయటపడ్డాడు. సంఘటన స్థలానికి ఒన్, టూ టౌన్ పోలీస్ ఇన్స్‌పెక్టర్లు సదానాగరాజు, డీ.శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌ఐ ఎండీ.గౌస్ చేరుకుని పంచనామా నిర్వహించారు. బుధవారం మృతదేహాలను మిర్యాలగూడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి మార్చురీకి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
ఇద్దరు చిన్నారులతో సహా తల్లి ఆత్మహత్య
జగిత్యాల జిల్లా మల్యాల మండలం సర్వాపూర్ (కొత్తపల్లె) గ్రామానికి చెందిన ఆది స్వప్న(25) తన ఇద్దరి కుతుర్లతో సహ ఆత్మహత్యకు పాల్పడింది. గంగాధర మండలం చెర్లపల్లెకు చెందిన స్వప్న కొత్తపల్లె గ్రామానికి చెందిన ఆది నరేష్‌తో వివాహం జరిగింది. వారిద్దరికీ ఇద్దరు చిన్నారులు అహల్యశ్రీ(3), విన్ను(4నెలలు). నరేష్ మల్యాలలో లేడీస్ ఎంపోరియం నిర్వహిస్తున్నాడు. మంగళవారం ఇంట్లో అత్తమామలకు చెప్పి మల్యాల లేడీస్ ఎంపోరియంకు వెళ్తున్నానని బయలుదేరిన ఆమె చీకటి పడే వరకు షాపు, ఇంటికి తిరిగిరావకపోవడంతో స్వప్న కుటుంబసభ్యులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న మల్యాల పోలీసులు ధర్యాప్తు జరుపగా బుధవారం మల్యాల బైపాస్‌రోడ్‌లోని పెద్దమ్మగుడి సమీపాన ఓ వ్యవసాయ బావిలో శావాలై తేలారు. స్థానికుల సమాచారంతో స్వప్న తన ఇద్దరి పిల్లలతో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్థారించారు. తల్లి కూతుళ్ల మరణానికి కుటుంబ కలాహాలు, వరకట్న వేధింపులు కారణమని తెలిసింది. అత్తమామలు, భర్త, మరిది, కట్నం కోసం వేధిస్తున్నారని తన కూతురు తరుచూ బాధపడేదని స్వప్న తల్లి గుంటి లక్ష్మీ ఆరోపించార. ఆమె ఫిర్యాదు మేరకు నలుగురిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు మల్యాల ఎస్సై ఉపేంద్రచారి వివరించారు.
చిత్రాలు.. మిర్యాలగూడలో ఆత్మహత్య చేసుకున్న చిత్రలేఖ, కుమారుడు లోహిత్
*మృత్యుంజయుడు రోహిత్ (ఇన్‌సెట్‌లో)
*సర్వాపూర్‌లో బావిలో పడి ఇద్దరు చిన్నారులతో ఆత్మహత్య చేసుకున్న స్వప్న