క్రైమ్/లీగల్

అధిక వడ్డీ ఆశ చూపి.. రూ. 9కోట్లతో ఉడాయించిన దంపతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 25: అధిక వడ్డీల ఆశ చూపి ఘరానా మోసానికి పాల్పడిన ఘటన పాతబస్తీ డబీర్‌పుర పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అతి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలకునే వారిని లక్ష్యంగా నిందితులు మోసాలకు పాల్పడ్డారు. డబీర్‌పురకు చెందిన దంపతులు బుశ్రా, సిరాజ్ ఉర్ రెహామాన్ యూఐఆర్‌సీ పేరిట సొసైటీ స్థాపించారు. సొసైటీలో దాచిన డబ్బులకు రెట్టింపు డబ్బులు ఇస్తామని అమాయక ప్రజలను మోసం చేశారు. సుమారు వంద మందికి పైగా వ్యక్తుల నుంచి రూ. 9 కోట్ల రూపాయలు వసూలు చేసి.. ఆ డబ్బులతో దంపతులు ఉడాయించారు. బాధితుల ఫిర్యాదుతో అసలు విషయం బయటపడింది. ఇచ్చిన డబ్బులకు రెట్టింపు ఇస్తామని మోసం చేస్తూ మలక్‌పేట్, సైదాబాద్, డబీర్‌పుర, సంతోష్‌నగర్, చార్మినార్‌తో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన అనేకమంది నుంచి భారీగా నగదు సేకరించారు. ఈ క్రమంలో ఎంతకాలమైనా డబ్బులు ఇవ్వకపోవడంతో అడగడానికి వెళ్లిన తమపై అనుచరులతో కలిసి దాడి చేయించారని బాధితులు ఆరోపిస్తున్నారు. తమను మోసం చేసిన వారిపై చర్యలు తీకొని తమ డబ్బు తమకివ్వాలని బాదితులు పోలీసు అభికారులను కోరుతున్నారు. ఈ ఘటను సంబంధించి గురువారం సైదాబాద్ పోలీసులకు ఐదుగురు బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ కేసుకు సంబంధించి మోసానికి బలైన వారు ఎంతమంది ఉన్నారు? ఇంకా ఇతర ప్రాంతాల్లో కూడా డబ్బులు వసూలు చేశారా? అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.