క్రైమ్/లీగల్

బిగ్‌బాస్-3 నిలిపివేయాలని ఏపీ హైకోర్టులో పిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జూలై 26: రియాలిటీ టీవీ షో బిగ్‌బాస్-3 ప్రసారం నిలిపివేయాలని ఏపీ హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు, సినీ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఈ పిల్‌ను దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంలో కేంద్ర ప్రభుత్వం, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్, సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్ట్ఫికేషన్ చైర్‌పర్సన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఏపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసులతోపాటు స్టార్ మా ఎండి మాల్, హీరో నాగార్జునతో కలిపి మొత్తం 11 మందిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా పిటిషనర్ విలేఖరులతో మాట్లాడుతూ గతంలో తెలంగాణ హైకోర్టులో ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశామని, దానిపై ఈనెల 29న తుది విచారణ జరుగనుందన్నారు. ఇప్పుడు పిల్ ద్వారా బిగ్‌బాస్ వివాదాలను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దృష్టికి తీసుకువచ్చామన్నారు. ఈ వ్యాజ్యంలో బిగ్‌బాస్-3 ప్రసారం నిలుపుదల చేయాలని కోరడంతోపాటు కళాకారుల ఏంపికలో జరుగుతున్న అక్రమాలను తెలియచేశామన్నారు.