క్రైమ్/లీగల్

ఉపాధ్యాయుల భర్తీపై నివేదిక అందజేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 26: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల భర్తీపై మూడు వారాల్లో నివేదిక ఇవ్వాలని తెలుగు రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. గడువులోగా నివేదిక సమర్పించకపోతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు ధర్మాసనం ఎదుట హాజరుకావాల్సి వస్తుందని కోర్టు తీవ్రంగా హెచ్చరించింది. తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలల్లో వౌలిక సదుపాయాల కల్పనపై జేకే రాజు దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఎంఆర్ షాతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించింది. దీనిపై పూర్తి వివరాలు అందించేందుకు అందించేదుకు కొంత సమయం కావాలని ఏపీ తరఫున అడ్వొకేట్ ఆన్ రికార్డ్సు జీఎన్ రెడ్డి కోర్టును అభ్యర్థించారు. ఏడు సంవత్సరాలు నుంచి తెలంగాణలో, నాలుగేళ్ల నుంచి ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయుల భర్తీ చేపట్టలేదని తెలంగాణ పేరెంట్స్ అసోషియేన్ తరఫున న్యాయవాది శ్రావణ్ కుమార్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో తెలుగు రాష్ట్రాలలో ఉపాధ్యాయుల భర్తీ, తాజా పరిస్థితిపై మూడు వారాల్లో నివేదిక ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది.