క్రైమ్/లీగల్

కమల్‌నాథ్ మేనల్లుడికి తాత్కాలిక ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 27: అగస్టావెస్ట్‌లాండ్ వీవీఐపీ హెలీకాప్టర్ల కుంభకోణం కేసులో మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ మేనల్లుడు రతుల్ పూరికి ఢిల్లీ కోర్టులో ఊరట లభించింది. ఈనెల 29 వరకూ ఆయనను అరెస్టు చేయకుండా న్యాయస్థానం మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది. వీవీఐపీ హెలీకాప్టర్ల కుంభకోణం కేసులో పూరిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. కేసు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు. ఈ కేసులో విచారణకు తాను పూర్తిగా సహకరిస్తున్నప్పటికి అరెస్టుకు ప్రయత్నిస్తున్నారని ఆయన కోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోసం పెట్టుకున్న దరఖాస్తును విచారించిన ప్రత్యేక న్యాయమూర్తి ఇంద్రజిత్ సింగ్ తాత్కాలిక ఉపశసమనం కల్పించారు. సోమవారం వరకూ అరెస్టు చేయొద్దని జడ్జి ఆదేశించారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు ఇటీవల కమల్‌నాథ్ ప్రభుత్వంలో చేరారని, వారు చేరినప్పటి నుంచీ తన అరెస్టుకు ప్రయత్నాలు ఎక్కువయ్యాయని పూరి ఆరోపించారు. మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ మేనల్లుడు రతుల్ పూరి హిందూస్తాన్ పవర్‌ప్రాజెక్టు(ప్రై) లిమిటెడ్‌కు చైర్మన్‌గా ఉన్నారు. 3,600 కోట్ల వీవీఐపీ హెలీకాప్టర్ల కుంభకోణంలో పూరిపై అభియోగాలు నమోదయ్యాయి. ఈడీ మనీలాండరింగ్ కేసును నమోదు చేసింది. తన క్లయింట్ ఇప్పటికే 22 సార్లు ఈడీ విచారణకు హాజరయ్యారని, ఆయన పాస్‌పోర్టు కూడా స్వాధీనం చేసుకున్నారని సీనియర్ న్యాయవాది ఏఎం సింఘ్వీ కోర్టుకు తెలిపారు. పూరి ఎక్కడికీ పారిపోయే పరిస్థితులు లేవని ఆయన చెప్పారు.