క్రైమ్/లీగల్

హైదరాబాద్ వ్యాపారవేత్త సతీష్ బాబు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: వివాదాస్పద మాంసం ఎగుమతిదారు మొయిన్ ఖురేషీ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి కీలకవ్యక్తిగా భావిస్తున్న హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త సానా సతీష్ బాబును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న సతీష్ బాబు కోసం సీబీఐ గత ఏడాదికాలంగా ఎదురుచూస్తోంది. తొలుత ఈ హైదరాబాద్ వ్యాపారవేత్తను మనీ లాండరింగ్ కేసులో సాక్షిగానే ఈడీ పరిగణించింది. అయితే, తాజా పరిణామాల నేపథ్యంలో మొయిన్ ఖురేషీ అక్రమాస్తుల కేసులో సతీష్ బాబుకు ప్రత్యక్షంగా సంబంధాలు ఉన్నాయని సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి అవినీతి నిరోధక పరిరక్షణ చట్టం (పీఎంఎల్‌ఏ) కింద సతీష్ బాబును ఈడీ అరెస్టు చేసినట్టు ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఈ హైదరాబాద్ వ్యాపారవేత్తను ఈడీ తమ అదుపులోకి తీసుకుని కొన్ని గంటలపాటు విచారించినప్పటికీ ‘ఎలాంటి సహకారం అందించలేదు’ అని ఆ వర్గాలు తెలిపాయి. ఆయన ఖురేషీకి చెందిన పలు ఆర్థిక లావాదేవీలతో సంబంధాలు ఉండడంతో అతని నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఈడీ అరెస్టు చేసినట్టు ఆ వర్గాలు పేర్కొన్నాయి. లంచం కేసుతోపాటు ఖురేషీకి చెందిన అక్రమ వ్యాపార కార్యకలాపాల్లో సతీష్ బాబు పాత్ర ఉందని ఆ వర్గాలు తెలిపాయి. మరికొన్ని రోజులపాటు కస్టడీలో తీసుకునేందుకుగాను అతనిని స్పెషల్ కోర్టు ఎదుట ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కేసును ప్రభావితం చేసేందుకు పలు అధికారులు, అనధికారులకు భారీగా ముడుపులు ఇచ్చినట్టు సతీష్ బాబు సంచలన ఆరోపణలు చేశారు. అయినప్పటికీ తనను వేధిస్తున్నారంటూ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని కీలక శాఖల అధికారులకు ఆయన లేఖలు రాశారు. మొయిన్ ఖురేషీ కేసులో తనను తప్పించేందుకు సీబీఐ మాజీ స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానాకు రెండు కోట్ల రూపాయల లంచం ఇచ్చినట్టు సతీష్ బాబు ఇటీవల ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారం సీబీఐలో అంతర్గత విభేదాలకు దారితీసింది. ఫలితంగా సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, మాజీ స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానా తమ పదవులను వదులుకోవాల్సి వచ్చింది.