క్రైమ్/లీగల్

దుబాయ్‌లో శివాజీ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 27: సినీనటుడు శివాజీని దుబాయ్ ఎయిర్ పోర్టు అధికారులు శనివారం అరెస్టు చేశారు. హైదరాబాద్ నుంచి దుబాయ్ మీదుగా అమెరికా వెళ్లడానికి ప్రయత్నించిన శివాజీని ఎయిర్‌పోర్టు ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నటుడు శివాజీ టీవీ9 షేర్ల వాటాల కొనుగోలులో నకిలీ పత్రాలు సృష్టించారని టీవీ9 కొత్త యాజమాన్యం అలంద మీడియా శివాజీపై సైబరాబాద్ కమిషనరేట్‌లో ఫిర్యాదు చేసింది. శివాజీ విదేశాలకు పారిపోకుండా తెలంగాణ పోలీసులు లుక్ అవుట్ నోటీసు జారీ చేశారు. ఇటీవల శివాజీ అమెరికా వెళ్లడానికి హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకోగా, ఎయిర్‌పోర్టు ఇమ్మిగ్రేషన్ అధికారులు లుక్ అవుట్ జారీ చేసినందున అమెరికా వెళ్లడానికి వీలుకాదని శివాజీని తిరిగి ఇంటికి పంపించారు. అయితే మరోసారి హైదరాబాద్ నుంచి దుబాయ్ మీదుగా అమెరికా వెళ్లడానికి ప్రయత్నించిన శివాజీని దుబాయ్ నుంచి వెనక్కు పంపించారు.

చిత్రం...దుబాయ ఎయిర్ పోర్టులో సినీ నటుడు శివాజీ