క్రైమ్/లీగల్

తిరుమల నుంచి వస్తూ తిరిగిరాని లోకానికి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మద్దిపాడు, జూలై 28: తిరుమల వెళ్లి దైవదర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదానికి గురై నలుగురు దుర్మరణం పాలైన సంఘటన ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం గుండ్లాపల్లి వద్ద ఆదివారం చోటుచేసుకుంది. కారు డ్రైవర్ అతి వేగంగా నడుపుతూ ముందు వెళుతున్న పాల ట్యాంకర్‌ను వెనుక వైపు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఒంగోలులోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాద సంఘటన వివరాలను ఎస్‌ఐ విలేఖరులకు వివరించారు. మద్దిపాడు మండల పరిధిలోని గుండ్లాపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం మేడూరు గ్రామానికి చెందిన తండ్రీకొడుకులు, అదే జిల్లా తోట్లవల్లూరు మండలం దేవరపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. విప్పంశెట్టి పాండురంగారావు (42) మేడూరు
గ్రామంలో కిరాణా షాపు నిర్వహిస్తున్నాడు. ఆయన కుటుంబం, అతడి బావమరిదితో కలిసి తిరుమలకు వెళ్లడానికి జొన్నల సాంబిరెడ్డి కారును బాడుగకు మాట్లాడుకున్నారు. ఆ కారులో పాండురంగారావు, ఆయన భార్య అనురాధ, కుమారుడు శ్యాంసత్యసాగర్ (10), కుమార్తె భానుప్రియ, బావ శేగు వీరవెంకట నరసింహారావు (39) తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. ఆదివారం తెల్లవారుజామున సుమారు మూడు గంటల సమయంలో ముందు వెళుతున్న పాల ట్యాంకర్‌ను కారు వెనుక నుండి అతి వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పాండురంగారావు కుమారుడు శ్యాంసత్యసాగర్, బావ వీరవెంకట నరసింహారావు, డ్రైవర్ సాంబిరెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. పాండురంగారావు భార్య అనురాధ, కుమార్తె భానుప్రియకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో చికిత్స నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. ఘటనా స్థలాన్ని ఒంగోలు డిఎస్‌పి ప్రసాద్, ఒంగోలు రూరల్ సిఐ పి సుబ్బారావు సందర్శించారు. మృతదేహాలను శవపంచనామా నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. పాండురంగారావు భార్య అనురాధ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ ఎస్‌కె ఖాదర్ బాషా కేసు నమోదు చేశారు. సిఐ పి సుబ్బారావు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. అనురాధ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
చిత్రం...గ్యాస్ కట్టర్ల సహాయంతో డోర్లు తొలగిస్తున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు