క్రైమ్/లీగల్

చైన్‌స్నాచర్ల అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 28: అంబర్‌పేట్ పోలీస్టేషన్ పరిధిలో జరిగిన చైన్‌స్నాచింగ్ కేసును పోలీసులు 24 గంటలో ఛేదించారు. అంబర్‌పేట్ డీడీ కాలనీలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్.. విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. అంబర్‌పేట్ డీడీ కాలనీ సాయి బాబా ఆలయం దగ్గర ఓ మహిళ మెడలోంచి గుర్తు తెలియని వ్యక్తులు ఈనెల 27 రాత్రి 9.40 గంటల ప్రాంతంలో బంగారు గొలుసును దొంగలించారు. దీంతో బాధితురాలు రాత్రి 11.00 గంటల ప్రాంతంలో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీ ఫుటేటజ్‌ల ఆధారంగా ఈ కేసును కేవలం 12 గంటల్లో ఛేదించి నిందితులను పట్టుకున్నట్లు సీపీ తెలిపారు. ఈస్ట్ జోన్ డీసీపీ పర్యవేక్షణలో ఏసీపీ ఎం.సుదర్శన్ ప్రత్యేక టీమ్‌లను రంగంలోకి దింపారు. హర్ష జోషి (19), పోట్లకరి మనోజ్ కుమార్ (18), ఠాకుర్ ఆశ్వీన్ సింగ్ (22) కలిసి చైన్‌స్నాచింగ్‌కు పాల్పడ్డారు. పట్టుబడిన వారు మొదటి సారి దొంగతనానికి పాల్పడిన్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులను కాచిగూడ రైల్వే స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం ఐదు గంటల ప్రాంతంలో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు ఛేదించేందుకు కృషి చేసిన పోలీసు సిబ్బందిని, కానిస్టేబుల్స్‌ను సీపీ ప్రత్యేకంగా అభినందించారు. నిందితుల నుంచి నాలుగు తులాల పుస్తేల తాడును స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.