క్రైమ్/లీగల్

సంగం డెయిరీలో రూ.44.43లక్షల చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేబ్రోలు : కట్టుదిట్టమైన భద్రతతో ఉండే గుంటూరు జిల్లా వడ్లమూడిలోని సంగం డెయిరీలో భారీ దొంగతనం జరిగింది. రూ.44 లక్షలకు పైగా సొమ్మును చోరులు అపహరించారు. ఇంత పెద్దమొత్తంలో నగదు దోచుకెళ్లడంతో డెయిరీ యాజమాన్యం, ఉద్యోగులు ఉలిక్కిపడ్డారు. పోలీసుల కథనం మేరకు... వడ్లమూడి సంగం డెయిరీలోని మొదటి అంతస్తులోని క్యాష్ కౌంటర్ గదిలోని బీరువాలో 70 లక్షలకు పైగా నగదు ఉంది. శని, ఆదివారాలు బ్యాంకులకు సెలవులు కావడంతో బీరువాలోనే భద్రపరిచారు. ఆదివారం అర్ధరాత్రి కొందరు వ్యక్తులు గ్యాస్ కట్టర్‌తో బీరువాను కట్‌చేసి రూ.44.43 లక్షల నగదును దోచుకెళ్లారు. సోమవారం ఉదయానే్న క్యాష్ కౌంటర్ గది తెరిచిన డెయిరీ ఉద్యోగులు నిర్ఘాంతపోయారు. బీరువా లాకర్ కట్‌చేసి ఉండటాన్ని గమనించి వెంటనే యాజమాన్యానికి, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన చేబ్రోలు సీఐ పివి శ్రీనివాసరావు, ఎస్‌ఐ సిహెచ్ కిషోర్ సంఘటనా స్థలానికి చేరుకుని దొంగతనం జరిగిన బీరువాను, అలాగే సీసీ కెమెరా ఫుటేజీని కూడా పరిశీలించారు. గుంటూరు నుంచి క్లూస్‌టీమ్ వచ్చి సంఘటనా స్థలంలో వేలిముద్రల నమూనాలను సేకరించారు. అలాగే గుంటూరు సౌత్ డిఎస్పీ కమలాకరరావు కూడా సంఘటనా స్థలానికి వచ్చి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సంఘటనపై సీఐ శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తామని తెలిపారు.