క్రైమ్/లీగల్

విలువైన భూమి కబ్జాకు యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, జూలై 29: హైటెక్ సిటీని ఆనుకుని ఉన్న 100 గజాల స్థలం ఐదు లక్షలకే.. నడుచుకుంటూ హైటెక్ సిటీకి వెళ్లవచ్చు అంటూ గత దశాబ్ద కాలం నుంచి పేద, మధ్య తరగతి ప్రజలను మోసం చేస్తు కోట్ల రూపాయలు మోసం చేసిన ముఠాలో 25 మందిని పోలీసులు అరెస్టు చేశారు. రాయదుర్గ సీఐ రవీందర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలి సర్వే 32 నుంచి 40లోని 99 ఎకరాల భూమిని 1990లో అప్పటి కలెక్టర్.. మొబైల్ వెల్ఫేర్ సొసైటీకి పట్టా ఇచ్చినట్లు ధర్మరాజు అనే వ్యక్తి నకిలీ పత్రాలు సృష్టించారు. ధర్మరాజు 99 ఎకరాల భూమిని అనేకమందికి జీపీఏ ఇచ్చారు. ప్రగతి వెల్ఫేర్ అసోసియేషన్‌కు గచ్చిబౌలి సర్వేనెంబర్ 38లో ధర్మరాజు నాలుగు ఎకరాలు ఇచ్చినట్లు నాగమణి సురేందర్ నకిలీ పత్రాలు సృష్టించి 2015లో రిజిస్ట్రేషన్ చేయించుకుంది. సర్వే నెంబర్ 38లో భూమి ఇచ్చినట్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్న నాగమణి ఖాళీగా ఉన్న 32లో రూములు నిర్మించి రూ.5 లక్షల నుంచి రూ.10లక్షల వరకు విక్రయించారు. గత మూడున్న సంవత్సరాలుగా మొబైల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు 32లో 165 మందికి విక్రయించారు. స్థలాలు కోనుగోలు చేసినవారు ప్రగతినగర్ కాలనీగా పేరు పెట్టుకుని రూములు నిర్మించుకుని నివాసం ఉంటున్నారు. సర్వే 32లోని నాలుగు ఎకరాలకు చెందిన భూమి యజమానులు ఖాళీ చేయాలని ఎన్నిసార్లు చెప్పిన మొబైల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు.. కోర్టు నుంచి ఏదో ఒక ఆర్డర్‌ను తీసుకుని వచ్చేవారు. సుప్రీమ్‌కోర్టును భూమి యజమానులు ఆశ్రయించడంతో న్యాయస్థానం ఆదేశాలతో కంచి సురేందర్ (60) ఇసాకీ ముత్తు (50) గడ్డమల్ల చిన్నయ్య (60) మోతోజు విక్రమ్ (55), భాస్కర్‌రావు(46), తలారి రాములు (43), లక్ష్మిబాయి (40), గోవిందమ్మ (40), సంతోష (40), రాములు (36), కోటయ్య (30), శివకుమార్ (35), పాండు (40), జీవన్ కుమార్ (33), ధనీదీప (67), శివరాజ్ (38), రవీందర్ (32), సుధాకర్ (22), సుందర్ రావు (65), కామేశ్వరరావు (45), యాదగిరి (38), అశోక్ (33), భాస్కర్ (31), గంటి ఝాన్సీ (42)ని అరెస్టు చేసినట్లు రాయదుర్గం సీఐ తెలిపారు. తాటిరెడ్డి అగమ రెడ్డి, కృష్ణారెడ్డి, సుజాత, ధర్మరాజు, రామారావు, శ్రీనివాస్, సతీష్ పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు. రంగారెఢ్డి జిల్లా కలెక్టర్ పట్టా ఇచ్చినట్లు నకిలీ పత్రాలను దర్మరాజు సృష్టించి మోసాలు చేస్తున్నాడని 2015లో సీసీఎస్ పోలీసులకు అప్పటి కలెక్టర్ రఘనందన్ రావు ఫిర్యాదు చేశారు. 2000 సంవత్సరంలో నాలుగు ఎకరాలను ఐఐసీ సంస్థతో పాటు బాబురావు, కోహీలే నలుగురు అనిల్ కుమార్ కాంధార్ నుంచి కొనుగోలు చేశారు. నాలుగు ఎకరాలను కొనుగోలు చేయడంతో పాటు యూఎల్‌సీ కూడా కట్టారని పోలీసులు తెలిపారు. ధర్మరాజు దొరికితే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని సీఐ తెలిపారు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.