క్రైమ్/లీగల్

హితుడే కిడ్నాప్ సూత్రధారుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 30: దోమల్‌గూడకు చెందిన వ్యాపారి గజేంద్ర పరఖ్ కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. కేసులో నలుగురు కిడ్నాపర్లను పోలీసులు అరెస్టు చేశారు. డబ్బుల కోసమే గజేంద్రను కిడ్నాప్ చేశారని, తెలిసిన వారే ఈ కిడ్నాప్‌నకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.
బషీర్‌బాగ్‌లోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేఖరుల సమావేశంలో నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ పూర్తి వివరాలు వెల్లడించారు. తనను కిడ్నాప్ చేసి రూ.3 కోట్లు డిమాండ్ చేశారని, కోటి రూపాయలు ఇచ్చి బయటపడ్డానని సోమవారం గజేంద్ర పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. తాము డబ్బుల కోసమే గజేంద్రను కిడ్నాప్ చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ కేసులో ముగ్గురు కిడ్నాపర్లు మహ్మద్ అల్మాస్ (21), మహ్మద్ అక్బర్ (22), మీర్ షఫీక్ అలీ (19)ని అరెస్టు చేయగా మరో ఇద్దరు తప్పించుకు తిరుగుతున్నారని, వారిని కూడా తప్పకుండా పట్టుకుంటామని సీపీ తెలిపారు. తెలిసిన వారే ఈ కిడ్నాప్‌కు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. గజేంద్ర మిత్రుడే ఈ కిడ్నాప్ ముఠాకు నాయకుడిగా వ్యవహరించారని పోలీసులు అనుమానిస్తున్నారు. గజేంద్ర కోట్లల్లో వ్యాపారం చేస్తుంటాడని, ఆయనను కిడ్నాప్ చేయడంతో కోట్ల రూపాయలు రాబట్టవచ్చునని గజేంద్ర స్నేహితుడు అల్మా అనే వ్యక్తి ఈ కిడ్నాప్‌కు స్కెచ్ వేశాడని, మరో ఇద్దరితో అతను కలిసి కిడ్నాప్ చేశాడని పోలీసులు తెలిపారు. డబ్బులు తీసుకొని గజేంద్రను అల్మా గ్యాంగ్ ఇప్పటికే విడిచిపెట్టింది. కేసుకు సంబంధించి ముగ్గురిని అరెస్టు చేసి రెండు కార్లు, ఒక మైక్‌ను పోలీసులు సీజ్ చేయగా రూ.35.30 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసుకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించేందుకు స్థానిక చిక్కడపల్లి పోలీసులతో పాటు టాస్క్ఫోర్స్ బృందాలు రంగంలోకి దిగి కిడ్నాపర్‌లను పట్టుకున్నారు.