క్రైమ్/లీగల్

కృష్టా ట్రిబ్యునల్ విచారణ వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన కృష్ణా నదీ జలాలను రెండు తెలుగు రాష్ట్రాలకు విభజించేందుకు ఉద్దేశించిన జస్టిస్ బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌లో విచారణ ఆగస్టు 19, 20, 21 తేదీలకు వాయిదా పడింది. బుధవారం జస్టిస్ బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ముందు తెలంగాణ రాష్ట్రానికి సాక్షిగా ఉన్న ఘనశ్యాం ఝాను ఏపీ తరపు సీనియర్ న్యాయవాది ఆర్.వెంకటరమణి క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఏపీ తరపు న్యాయవాది అడిగిన పలు ప్రశ్నలకు తెలంగాణ సాక్షి ఘనశ్యాం సమాధానాలు ఇచ్చారు. తదుపరి క్రాస్ ఎగ్జామినేషన్ ఆగస్టు 19, 20, 21 తేదీలకు ధర్మాసనం వాయిదా వేసింది. తెలంగాణ తరపున సీనియర్ న్యాయవాది రవీందర్‌రావు, అడ్వొకేట్ ఆన్ రికార్డ్స్ కృష్ణమూర్తి స్వామి, ఏపీ తరపున న్యాయవాది ఉమాపతి, అడ్వొకేట్ ఆన్ రికార్డ్స్ జీఎన్ రెడ్డి, ఇరు రాష్ట్రాలకు చెందిన నీటి పారుదల శాఖ అధికారులు హాజరయ్యారు.