క్రైమ్/లీగల్

బ్రాండెడ్ పేరిట నకిలీ టీవీల విక్రయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, జూలై 31: స్థానికంగా తయారుచేసే అసెంబుల్డ్ ఎల్‌ఈడి టీవీలకు బ్రాండెడ్ స్టిక్కర్లు అంటించి అవే కంపెనీ టీవీలుగా నమ్మించి విక్రయిస్తూ ప్రజలను మోసం చేస్తున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులను నెల్లూరు నగరంలో నవాబ్‌పేట పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని షామిలీ, ముజఫర్‌నగర్ జిల్లాలకు చెందిన పఠాన్ షబ్బీర్‌ఖాన్, పఠాన్ అబ్దుల్ రహమాన్ అసెంబుల్డ్ టీవీలు, ఇతర గృహోపకరణ వస్తువులు కొని వాటికి బ్రాండెడ్ స్టిక్కర్లను అంటిస్తారు. అలాగే వాటికి అదే బ్రాండెడ్ కంపెనీ బాక్సులను సేకరించి ఆ వస్తువులను అందులో ఉంచి అవి బ్రాండెడ్ కంపెనీ టీవీలుగా నమ్మించి నెల్లూరులో విక్రయిస్తున్నారు. నెల్లూరులో వెంకటేశ్వరపురంలో అదేమాదిరిగా అమ్మే ప్రయత్నం చేస్తుండగా నవాబ్‌పేట సీసీఎస్ పోలీసులు గుర్తించి వారిని అదుపులోకి తీసుకుని విచారించగా నకిలీల మోసం బయటపడింది. దీంతో వారు నిల్వవుంచిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నగర డీఎస్పీ శ్రీనివాసులురెడ్డి బుధవారం విలేఖర్ల సమావేశం ఏర్పాటుచేసి పై విషయాలను వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన వీరిద్దరూ గత కొంతకాలంగా ఇదేమాదిరిగా ప్రజలను మోసం చేస్తున్నట్లు విచారణలో తేలిందని బ్రాండెడ్ స్టిక్కర్లతో ఉన్న 72 అసెంబుల్డ్ ఎల్‌ఇడి టీవీలను స్వాధీనం చేసుకుని వారిని అరెస్ట్ చేసినట్లు, వాటి విలువ సుమారు 25 లక్షల రూపాయలు ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సీసీఎస్ సీఐ బాజీజాన్ సైదా, నవాబ్‌పేట సీఐ వేమారెడ్డి పాల్గొన్నారు.