క్రైమ్/లీగల్

25 లక్షలు ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఉన్నావో రేప్ కేసుపై సుప్రీం కోర్టు గురువారం పలు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో బాధిత కుటుంబానికి 25 రూపాయలు నష్టపరిహారంగా చెల్లించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి యూపీలోని వివిధ కోర్టుల్లో ఉన్న ఐదు కేసులను ఢిల్లీకి బదిలీ చేయాలని సూచించింది. గత వారం జరిగిన కారు ప్రమాదం సంఘటనపై విచారణను వారం రోజుల్లోగా పూర్తి చేయాలని సీబీఐకి హుకుం జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్, న్యాయమూర్తులు దీపక్ గుప్తా, అనిరుద్ధ బోస్ సభ్యులుగా ఉన్న సుప్రీం కోర్టు ధర్మాసనం ఉన్నావో కేసును త్వరితగతిన ముగించేందుకు చర్యలు చేపట్టింది. ఉన్నావో రేప్ కేసులో బాధిత మహిళ ప్రయాణిస్తున్న కారును గత వారం ఓ ట్రక్కు ఢీకొన్న సంఘటన సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో రేప్ బాధితురాలు, ఆమె లాయర్ తీవ్రంగా గాయపడగా, ఆమె అత్తలు ఇద్దరు మృతి చెందారు. ఈ కేసులో ముద్దాయిగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ కుట్రపన్ని వారిని హతమార్చేందుకు ప్రయత్నించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2017లో ఓ మైనర్‌పై జరిగిన అత్యాచార సంఘటనపై యూపీలోని వివిధ కోర్టులో కేసులు ఉన్నాయి. తాజాగా దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ జరుపుతున్నది. ఈ కేసును విచారణను 45 రోజుల్లోగా పూర్తి చేయాలని యూపీ ట్రయల్ కోర్టును ఆదేశించింది. పరస్పరం చర్చించిన తర్వాత, ఈ కేసును విచారించే న్యాయమూర్తి పేరును ఖరారు చేయాలని సూచించింది. బాధిత కుటుంబాల నుంచి ఎవరూ ప్రాతినిథ్యం వహించడం లేదు కాబట్టి ఎక్స్‌పార్టే ఆర్డర్‌ను జారీ చేస్తున్నట్టు సుప్రీం కోర్టు ధర్మాసనం ప్రకటించింది. ఈ ఆదేశాన్ని పునఃపరిశీలించాలనిగానీ, కొట్టివేయాలనిగానీ దాఖలయ్యే ఎలాంటి పిటిషన్లను స్వీకరించే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది. అత్యాచార బాధితురాలు, ఆమె తల్లి, ఇతర కుటుంబ సభ్యులకు కమాండెంట్ స్థాయిగల అధికారి నేతృత్వంలో సీఆర్‌పీఎఫ్ భద్రతను కల్పించాలని ఆదేశించింది. దీనిపై నివేదిక అందించాలని సూచించింది. కింగ్ జార్జి మెడికల్ కాలేజీ ఆసుపత్రి నుంచి బాధితురాలు, ఆమె లాయర్‌ను ప్రత్యేక విమానం లేదా హెలికాప్టర్ ద్వారా ఎయిమ్స్‌కు తరలించాలని సీబీఐ అధికారులు వౌఖికంగా చేసిన సూచనను కూడా సుప్రీం కోర్టు ధర్మాసనం పరిగణలోకి తీసుకుంది. రాయ్‌బరేలీ జైసల్లో ఉన్న బాధితురాలి సమీప బంధువు మహేష్ సింగ్‌ను ఢిల్లీలోని జైలుకు పంపాల్సిందిగా దాఖలైన విజ్ఞప్తిని శుక్రవారం పరిశీలించనున్నట్టు ప్రకటించింది.
గత వారం జరిగిన కారు ప్రమాదంలో మహేష్ సింగ్ భార్య మృతి చెందింది. అలహాబాద్ హైకోర్టు పెరోల్ ఇవ్వడంతో, ఆయన బుధవారం జరిగిన భార్య అంత్యక్రియలకు హాజరయ్యారు. కాగా, ఈ ప్రమాదంపై విచారణ చేపట్టిన సీబీఐ ఇప్పటి వరకూ 10 మందిపై కేసును నమోదు చేసింది. ఇప్పటికే జైల్లో ఉన్న బీజేపీ శాసన సభ్యుడు కుల్దీప్ సింగ్ పేరును కూడా అనుమానితుల జాబితాలో చేర్చింది.
చిత్రం...సుప్రీం తీర్పు అనంతరం మీడియాతో మాట్లాడుతున్న బాధిత కుటుంబ సభ్యుల అడ్వకేట్ రామకృష్ణా రెడ్డి