క్రైమ్/లీగల్

అప్పులుంటే అభివృద్ధి చేసుకోరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : అప్పులున్నాయని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోరా? అని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ఎర్రమంజిల్ భవనం కూల్చివేసి, కొత్త అసెంబ్లీ ప్రాంగణాన్ని నిర్మించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై గత పక్షం రోజులుగా విచారణ జరపుతున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషనర్లకు పలు ప్రశ్నలు సంధించింది. మంత్రిమండలి విధానపరమైన నిర్ణయాల్లో న్యాయవ్యవస్థ ఎలా జోక్యం చేసుకోవాలని హైకోర్టు ప్రశ్నించింది. రాష్ట్రానికి ఇప్పటికే వేల కోట్ల అప్పులు ఉన్నాయని పిటిషనర్ వాదనపై స్పందిస్తూ, అప్పు లు ఉన్నాయని అభివృద్ధిని ఆపగలమా అని ధర్మాసనం ప్రశ్నించింది. మంత్రిమండలి నిర్ణయ
ప్రక్రియలో చట్టపరమైన లోపం ఉందని పేర్కొంటున్న పిటిషనర్లు నిజాం మాదిరి భావించి వాదించవద్దని హైకోర్టు వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.
మందుబాబులకు షాక్
డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన మందుబాబులకు నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. 480 మంది మందుబాబులకు పలు శిక్షలను విధించింది. 62 మంది మందుబాబుల డ్రైవింగ్ లైసెన్స్‌లను రద్దు చేసింది. 31 మందికి మూడు రోజుల పాటు, 142 మందికి రెండు రోజుల పాటు జైలు శిక్ష విధించింది. 257 మందిని కోర్టు సమయం ముగిసే వరకూ నిలబడి ఉండాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఇద్దరికి జీవితకాలం పాటు డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేశారు.